గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో సరికొత్త ట్విస్ట్

తనను అరెస్ట్ చేయొద్దని హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమిలన్ రావు... ప్రమాదానికి అసలు కారణం ఫ్లైఓవర్ డిజైన్ సరిగ్గా లేకపోవడమే అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

news18-telugu
Updated: December 10, 2019, 7:34 PM IST
గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో సరికొత్త ట్విస్ట్
బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌, కిందపడిపోయిన కారు
  • Share this:
నగరంలో కలకలం రేపిన గచ్చిబౌలి ఫ్లైఓవర్ యాక్సిడెంట్ కేసులో పోలీసులు నిందితుడిగా పేర్కొంటున్న కారు డ్రైవర్ కృష్ణమిలన్ రావు హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయొద్దని హైకోర్టును ఆశ్రయించిన కృష్ణమిలన్ రావు... ప్రమాదానికి అసలు కారణం ఫ్లైఓవర్ డిజైన్ సరిగ్గా లేకపోవడమే అని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. యాక్సిడెంట్ తరువాత గాయాలతో ఆస్పత్రిలో చేరిన కృష్ణమిలన్ రావు... ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ యాక్సిడెంట్‌కు కారణం కారు నడుపుతున్న కృష్ణమిలన్ రావు అని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం సమయంలో అతడు 120 కి.మీ వేగంతో కారు నడుపుతున్నారని వాదిస్తున్నరు. అతడిని అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాయదుర్గం పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ నెల 12 వరకు కృష్ణమిలన్ రావును అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించిన హైకోర్టు... ఆ రోజు పోలీసులు వేసే పిటిషన్‌పై విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా... పలువురు గాయాలపాలయ్యారు.






First published: December 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>