NEW SCHEME TO GOVT SCHOOLS INFRASTRUCTURES TELANGANA CABINET APPROVES BUDGET VRY
Cabinet Decisions : ప్రభుత్వ విద్యకు మరిన్ని మెరుగులు.. 7000 కోట్లకు కేబినెట్ ఆమోదం.. ఇంగ్లీష్ మీడియం పై సబ్ కమిటీ
cm kcr
Cabinet Decisions : విద్యావ్యవస్థలో మరో కీలక స్కీం త్వరలో అమలు కానుంది. ప్రభుత్వ స్కూళ్లకు మరిన్ని హంగులు అద్దేందుకు ప్రవేశపెట్టిన పథకం మన ఊరు-మనబడి కోసం ఏడువేల కోట్లను ఖర్చు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ విద్యా బలోపేతానికి తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ విద్యకు మరింత ప్రాముఖ్యత ఇవ్వడంలో భాగంగా ప్రవేశపెట్టిన మన ఊరు-మనబడికి పథకం కింద పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ...ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ ., మరియు., వచ్చేవిద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధనకై.., కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షురాలిగా..మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.
ముఖ్యంగా రానున్న విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్యను ప్రవేశ పెట్టేందుకు ఈ కమిటి విధివిధానాలను రూపోందించనుంది. కాగా ఈ కమిటి నివేదికను రానున్న అసెంబ్లీ సమావేశాల్లోగా అందించాలని అసెంబ్లీ చర్చించి బిల్లును తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ప్రైవేటు విద్యా వ్యవస్థల ఫీజుల నియంత్రణ అంశం కూడా ఈ కమిటీ చర్చించి నివేదిక ఇవ్వనుంది.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కూడా ఇదివరకే ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్యార్థులకు ప్రతి సంవత్సరం రెండు జతల స్కూలు యూనిఫామ్స్‌తో పాటు, పుస్తకాలు , ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం తాజాగా వారికి బ్యాగ్‌లు , షూస్ కూడా ఇవ్వాలని బావిస్తోంది.( New scheme to govt schools )రెండు జతల షూస్‌తో పాటు సాక్స్ కూడా ఇచ్చేందుకు వ్యుహాలు రచిస్తోంది. కాగా ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 లక్షల విద్యార్థుల కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు కానున్నట్టు అంచనా వేస్తున్నారు. కాగా దీనిపై కూడా త్వరలో మరోసారి చర్చించి ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.