Home /News /telangana /

Double Bedroom : డబుల్ ఇళ్లపై సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన .. సొంత స్థలాలకు కూడా..

Double Bedroom : డబుల్ ఇళ్లపై సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన .. సొంత స్థలాలకు కూడా..

Double Bedroom : డబుల్ ఇళ్లపై  సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన ..

Double Bedroom : డబుల్ ఇళ్లపై సీఎం కేసీఆర్ మరో కీలక ప్రకటన ..

Double Bedroom : డబుల్ బెడ్‌రూంల నిర్మాణంపై సీఎం కేసిఆర్ నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సొంత స్థలాలు ఉన్నవారికి ఇళ్లు నిర్మించుకునేందుకు డబ్బులు ఇవ్వనున్నట్టు చెప్పారు. అయితే ప్రతి నియోజకవర్గానికి కొన్ని ఇళ్ల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు...

ఇంకా చదవండి ...
    తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ( Telanagan assembly ) చివరి రోజున అనేక విషయాలు చర్చకు వచ్చాయి. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అసెంబ్లీలో ప్రతి పక్ష సభ్యులతో పాటు స్వపక్షం సభ్యులను కూడా పలు సమస్యలను ఎకరవు పెట్టారు. దీంతో సమావేశాల చివరి రోజు సీఎం కేసీఆర్ ( cm kcr ) సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతోపాటు రాష్ట్ర సంక్షేమ రంగం , అభివృద్దికి నిధుల లాంటీ పలు అంశాలపై సమాధానం చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా సొంత స్థలాలు ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలను ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ఇందుకు సంబంధించి కార్యచరణ చేపడుతున్నట్టు చెప్పారు. అయితే ప్రతి నియోజకవర్గానికి వేయ్యి లేదా పదిహేను వందలను కేటాయించేందుకు అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

    తెలంగాణ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల విలువైన డబుల్ బెడ్‌రూం ( double bedroom houses )ఇళ్లను పేద ప్రజలకు నిర్మించి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే డబుల్ ఇళ్ల కోసం రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన నిర్మాణాలు జరిగాయని చెప్పారు. నిరుపేదలు కూడా బహుల అంతస్థుల భవనాల్లో నివసించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టిందని పేర్కోన్నారు. రానున్న రోజుల్లో ప్రజల డిమాండ్ మేరకు సొంత స్థలాలు ఉన్నవారికి కూడా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు.

    ఇది చదవండి :   యాదాద్రి ప్రారంభోత్సంపై సీఎం కేసిఆర్ కీలక ప్రకటన

    కాగా అంతకుముందు రోడ్లు భవనాల శాఖమంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఇదే అంశాన్ని ప్రస్థావించారు. రాష్ట్రంలో డబుల్ ఇళ్ల కోసం మొత్తం 26 ,31, 739 అప్లికేషన్స్‌ వచ్చాయని చెప్పారు. కాగా ఇప్పటి వరకు రెండు లక్షల 91వేల ఇళ్లను మంజూరు చేసినట్టు చెప్పారు. అందులో 2,27000 ఇండ్లు ప్రారంభించి సుమారు లక్ష ఇండ్లను పూర్తి చేసినట్టు చెప్పారు.

    ఇది చదవండి : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ.. నేతలతో మంతనాలు..?


    అంతకుముందు   అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసిఆర్ మరోసారి కేంద్ర నిధులపై స్పందించారు. ఈ క్రమంలోనే కేంద్ర తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం డబుల్ ఉందని చెప్పారు. కేంద్రమే అప్పుల్లో కూరుకుకుపోయిన సమయంలో రాష్ట్రానికి అదనపు నిధులు ఎక్కడ నుండి ఇస్తుందని అన్నారు. ఇక రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా రావాల్సిన నిధులు మాత్రమే వస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 2 లక్షల 74 వేల కోట్లను పన్నుల రూపంలో ఇచ్చిందని అందుకు బదులుగా సగం నిధులు కూడా రాష్ట్రానికి రాలేదని చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రమే కేంద్రానికి నిధులు ఇస్తుంది తప్ప కేంద్రం తెలంగాణకు నిధులు లేవని చెప్పారు. దేశానికి నిధులు సమకూర్చే నాలుగైదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని చెప్పారు. ఇందుకు సంబంధంచి అనేక ఆర్థిక సంస్థలు కూడా తెలంగాణను ప్రశంసిస్తున్నాయని పేర్కొన్నారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Double bedroom houses

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు