NEW SCHEAM TO FARMERS OF TELANGANA CM KCR TO DISCUSS VRY
CM KCR : రైతులకు శుభవార్త.. వారికి మరో కొత్త పథకం.. కసరత్తు చేయాలని అధికారులకు ఆదేశించిన సీఎం
ప్రతీకాత్మక చిత్రం
CM KCR : తెలంగాణ రైతంగానికి సీఎం కేసిఆర్ మరో తీపి అందించనున్నారా.. ఇప్పటికే రైతు బీమా, రైతు బంధు అందిస్తున్న ఆయన ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేక పెన్షన్ కూడా కల్పించనున్నారా.. ?
సీఎం కేసిఆర్ రైతు ప్రభుత్వంగా మారేందుకు పలు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రైతుల కోసం రైతు బంధు, రైతు ప్రకటించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పథకాన్ని తీసుకువచ్చారు. మరోవైపు ఇరవైనాలుగు గంటల విద్యుత్‌తో పాటు నీళ్లను అందించే ప్రక్రియ కూడా విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రైతు రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకునేందుకు సీఎం కీలక మరో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో రైతులకు కూడా పెన్షన్ ఇచ్చేందుకు చర్చించినట్టు సమాచారం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సంఖ్య తో పాటు ఖర్చుపై అధికారులను ఆరా తీసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 57 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ సౌకర్యర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మాత్రం పది సంవత్సరాలు తగ్గించి 47 సంవత్సరాల నుండే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ పెన్షన్ పోందేందుకు మూడు ఎకరాల నుండి ఐదు ఎకరాల మధ్య భూమి ఉండి వ్యవసాయం చేసే వారికి రూ 2016 పెన్షన్ సౌకర్యం కల్పించే యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. కాగా ఈ పథకం రానున్న బడ్జెట్లోనే పట్టాలెక్కించేందుకు కూడా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ పథకం అమల్లోకి వస్తే పూర్తిగా రైతు అనుకూల ప్రభుత్వంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం మారే అవకాశాలు ఉండనున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాలు దూసుకువస్తుండడం గత రాజకీయా పరిస్థితులు ఇప్పుడు లేకపోవడంతో పాటు కేంద్రంతో డీ అంటే ఢీ అనే కోణంలో పోరాటం చేయనుండడంతో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది.
కాగా రైతుల విషయంలో ఇప్పటకే కేంద్ర నిర్ణయాలను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పీఎం మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నేడు ప్రధానిక ిలేఖ కూడా రాశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులకు గుదిబండగా మారనుందని తెలపడంతో పాటు పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.