శుక్రవారం ఉదయం హైదరాబాద్ చత్రీనాకలో విషాదం చోటు చేసుకుంది.. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలో బాణాసంచా కాల్చటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పశ్చిమబంగాల్‌కు చెందిన ఇద్దరు అక్కడిక్కడే మృతిచెందారు. యూపీకి చెందిన మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కాగా పాతబస్తీ కందికల్ గేట్ ప్రాంతంలో ఉల్లాస్ గత కొంతకాలంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) బొమ్మలు తయారుచేసే యూనిట్‌ను నడుపుతున్నారు. దీపావళి పూజ అనంతరం ఆ యూనిట్లో పనిచేసే పశ్చిమ బెంగాల్‌కు చెందిన విష్ణు(25), జగన్(30), ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన బీరెన్ (25)కు కొన్ని టపాసులను ఇచ్చి ఇంటికి వెళ్లిపోయాడు. గురువారం అర్ధరాత్రి సమయంలో టపాసులు కాలుస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి విష్ణు, జగన్‌లు అక్కడికక్కడే మృతిచెందారు. బీరెన్‌కు తీవ్రగాయాలయ్యాయి.
ఇది చదవండి : హైదరాబాద్‌లో నేడు సదర్ ఉత్సవాలు.. కోట్ల రూపాయలతో దున్నపోతుల అలంకరణ
అర్ధరాత్రి వేళ పెద్దశబ్ధం, ఆర్తనాదాలకు ఉలిక్కిపడ్డ స్థానికులు ఛత్రినాక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మాజిద్, ఛత్రినాక ఇన్స్పెక్టర్ ఖాదర్ జిలాని, ఫలక్‌నుమా ఇన్స్పెక్టర్ దేవేందర్‌లు పరిస్థితిని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన బీరెన్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో క్లూస్‌టీంతో ఆధారాలు సేకరించారు. ఘటనా స్థలంలోనే మృతిచెందిన విష్ణు, జగన్ మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఇది చదవండి : గుస్సాడి నృత్యాలతో గిరిజన గూడాలు... నెల రొజుల పాటు ప్రత్యేక సందడి..
అయితే పేలుడుకు కారణాలు ముందుగా బాణసంచా అని ప్రాధమిక భావించారు.. కాని బాణసంచా పేలుడుకు ఇద్దరు చనిపోవడంపై పోలీసులకు అనుమానాలు రేకెత్తడడంతో పేలుడు గల కారణాలను పోలీసులు ఆరాతీశారు.. దీంతో బాంబులతో పాటు కొన్ని కెమికల్స్ భూమిలో పాతిపెట్టి పేల్చడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పేలుడు తీవ్రత ఆ స్థాయిలో ఉందని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bomb, Crime story, Hyderabad