Home /News /telangana /

NEW POLITICAL PARTY ENTRY INTO IN TELANAGANA POLITICS VRY

TS Politics : తెలంగాణలో మరో కొత్త పార్టీకి అంకురార్పణ.. నేతలతో మంతనాలు..?

మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

మమత బెనర్జీ (ఫైల్ ఫోటో)

TS Politics : తెలంగాణలో మరో పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నాయా.. ? అది కూడా జాతీయ స్థాయిలో మోదీ ప్రభుత్వంతో ఢీ.. అంటే ఢీ అంటున్న పార్టీ నేతలు తెలంగాణ నేతలు పావులు కదుపుతున్నారా.. అయితే ఆ పార్టీలో చేరేవారు ఎవరు.. కొత్త పార్టీ టార్గెట్ నేతలు ఎవరు.. ?

ఇంకా చదవండి ...
  దేశంలో ఉన్న ప్రధాన పార్టీల్లో తృణముల్ కాంగ్రెస్ ఒకటి. ( Tmc )ముఖ్యంగా బీజేపీతో తీవ్రంగా పోరాటం చేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఎంసీ అని చెప్పవచ్చు. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే తీవ్రంగా ప్రధాని మోదీని సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీంతో పశ్చిమ బెంగాల్లో నువ్వా నేనా అన్నట్టు ఎన్నికలు జరిగినా.. చివరకు మమతా బెనర్జీ (cm mamata banerjee ) మరోసారి సీఎం పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ జాతీయ స్థాయిలో తన బలాన్ని పెంచుకోవాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీని (pm modi ) ఢికొట్టాలంటే బలమైన శక్తిగా ఎదగడమే ముఖ్యం. ఇందుకోసం జాతీయ పోరాటాలకు ఆ పార్టీ సన్నద్ధం అవుతోంది.

  ఇందులో బాగంగానే... ఆ పార్టీ తెలంగాణలో కూడా తన కలాపాలకు శ్రీకారం చుట్టెందుకు వ్యుహాలు రచిస్తున్నట్టు సమాచారం. దీంతో తెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ అంకురార్పణ జరగనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆ పార్టీకి చెందిన నేతలు ఇప్పటికే రాష్ట్రానికి చెందిన పలువురు మాజీ ఎంపీలతో సమావేశం అయినట్టు తెలుస్తోంది.

  ఇది చదవండి : ముగిసిన నామినేషన్ల పర్వం మొత్తం నామినేషన్లు.. ఎన్నంటే...


  ఇది చదవండి :  యాదాద్రి ప్రారంభోత్సంపై సీఎం కేసిఆర్ కీలక ప్రకటన

  కాగా తెలంగాణలో ఇప్పటికే ఇటివల రెండు కొత్త పార్టీలు పుట్టుకొచ్చాయి. వైఎస్ షర్మిల ( ys sharmila ) తన పార్టీ కార్యకలాపాలను ప్రారంభించగా... ఇటివల పదవి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం బీఎస్పీలో( bsp ) చేరి ఆ పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే దిశంగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే ఈ రెండు పార్టీలు కూడా కొత్తవే బీఎస్పీ గతంలో యూపీలో ( up ) అధికారం చెపట్టి ప్రస్తుతం ఎలాంటీ అధికారం లేకుండా ఉంది. ఇక వైఎస్ షర్మిల ప్రాబల్యం కోసం ప్రయత్నాలు చేస్తోంది. కాని ప్రస్థుతం రావాలనుకుంటున్న తృణముల్ కాంగ్రెస్ కు ( tmc ) మాత్రం బెంగాల్‌లో అధికారంలో ఉండడంతో మరోవైపు ఆమెకు ఉన్న రాజకీయ అనుభవంతో రాష్ట్రంలో కొంత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆమె పార్టీ పెడితే ఏ వర్గం వారు పార్టీలోకి వెళతారు. తాజా నేతలు ఎవరు ప్రస్తుతానికి వెళ్లకపోయినా... మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల్లో అవకాశాలు లభించని వారు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే పూర్తి కార్యచరణలోకి వస్తేగాని ఎవరు పార్టీ వైపు మొగ్గు చూపుతారనేది తేలనుంది.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Mamata Banarjee, Telangana Politics

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు