Telangana: ఆ విద్యార్థులకు కొత్త సర్టిఫికెట్లు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Telangana: భారీ వర్షాలు, వరదలు సర్టిఫికెట్స్ పోయాయని, డామేజ్ అయ్యాయని పేరెంట్స్, అలానే విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

news18-telugu
Updated: October 20, 2020, 9:38 PM IST
Telangana: ఆ విద్యార్థులకు కొత్త సర్టిఫికెట్లు.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ క్రమంలో విద్యార్థుల ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాల వల్ల, వరదల వల్ల సర్టిఫికెట్స్ కోల్పోయిన విద్యార్థులకు ఫ్రెష్ సర్టిఫికెట్స్ ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. సర్టిఫికెట్ కోల్పోయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఎలాంటి రుసుము తీసుకోకుండా ఫ్రెష్ లేదా డూప్లికేట్ సర్టిఫికెట్‌లు జారీ చేయనుంది. ఈ మేరకు పాఠశాల, ఇంటర్, సాంకేతిక, ఉన్నత విద్య శాఖ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

భారీ వర్షాలు, వరదలు సర్టిఫికెట్స్ పోయాయని, డామేజ్ అయ్యాయని పేరెంట్స్, అలానే విద్యార్థుల నుండి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రములో దసరా వరకు అన్ని పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీల రిజిస్ట్రార్ లకి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామ చంద్రన్ లేఖ రాశారు. రేపటి నుండి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే తెలంగాణను భారీ వర్షాలు వదలడం లేదు. హైదరాబాద్‌లో మంగళవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీంతో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.
Published by: Kishore Akkaladevi
First published: October 20, 2020, 9:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading