కొత్త మోటార్ చట్టం ఎఫెక్ట్.. తెలంగాణలో తొలి ఫైన్..?

గతంలో డ్రంక్&డ్రైవ్‌కి రూ.2వేలు జరిమానా విధించేవారు. కొత్తగా వచ్చిన చట్టంతో అది రూ.10వేలకు పెరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ ఇంకా కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురాలేదు.

news18-telugu
Updated: September 12, 2019, 12:40 PM IST
కొత్త మోటార్ చట్టం ఎఫెక్ట్.. తెలంగాణలో తొలి ఫైన్..?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలులోకి వచ్చాక.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారికి భారీ జరిమానాలు విధిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంకా దీన్ని అమలుపరచడం లేదు.కొత్త చట్టం అమలులోకి రాకపోయినా సరే.. ఓ వాహనదారుడికి భారీ జరిమానా విధించిన ఘటన నల్గొండలో చోటు చేసుకుంది.గత శుక్రవారం నకిరేకల్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. కోర్టు అతనికి రూ.10వేలు జరిమానా విధించింది.ఒకవేళ జరిమానా చెల్లించకపోతే 15 రోజుల పాటు జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది.

గతంలో డ్రంక్&డ్రైవ్‌కి రూ.2వేలు జరిమానా విధించేవారు. కొత్తగా వచ్చిన చట్టంతో అది రూ.10వేలకు పెరిగింది. అయితే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ శాఖ ఇంకా కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురాలేదు. అలాంటప్పుడు డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తికి రూ.10వేలు ఫైన్ ఎలా విధిస్తారన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇదే విషయంపై స్పందించిన నల్గొండ ఎస్పీ రంగనాథ్.. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటామని చెప్పారు. దానికి వాహన చట్టంతో సంబంధం లేదని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి జీవో ప్రకారమే చలానాలు విధిస్తామని చెప్పుకొచ్చారు.
Published by: Srinivas Mittapalli
First published: September 12, 2019, 12:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading