muncipal mayors : మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు వీరే.. ? పేర్లను ఖారారు చేసిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్(ఫైల్ పొటో)

muncipal mayors : రేపే మేయర్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్‌లను ఎన్నుకోనున్నారు. మేయర్ , చైర్మన్ అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ఎంపికపై కసరత్తు చేశారు. వీరి పేర్లను సీల్డు కవర్‌లో పార్టీ ఇంచార్జులకు పంపించనున్నారు.

  • Share this:
మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్, డిప్యూటి మేయర్లతో పాటు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శుక్రవారం మధ్యహ్నం కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే మేయర్ అభ్యర్థులపై సీఎం కేసిఆర్ కసరత్తు చేశారు. కరోనా నుండి కోలుకున్న తర్వాత హైదరాబాద్‌కు వచ్చిన సీఎం కేసిఆర్, మేయర్, చైర్మన్ల ఎన్నికపై కసరత్తు చేశారు. వారి పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం. వీరి పేర్లను సీల్డు కవర్‌లో అందించనున్నారు. అయితే కౌన్సిల్ సమావేశంలో వారిని అధికారికంగా ప్రకటించనున్నారు.

అయితే వరంగల్‌ మేయర్‌గా గుండు సుధారాణి, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ గా నీరజ పేర్లు దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. సిద్దిపేట మున్సిపాలిటీకి కడదర్ల మంజుల, జడ్చర్లలో దోరెపల్లి లక్ష్మి, నకిరేకల్‌లో రాచకొండ శ్రీను, అచ్చంపేటలో నర్సింహగౌడ్‌ లేదా శైలజకు చైర్‌ పర్సన్‌ కుర్చీ దక్కే అవకాశం ఉందని తెరాస శ్రేణులు భావిస్తున్నారు.

మేయర్‌, ఛైర్‌ పర్సన్ల ఎంపిక ప్రక్రియకు పరీశీలకులుగా ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిశీలకులుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ నూకల నరేశ్ రెడ్డి , వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , గంగుల కమలాకర్ , కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకులుగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులుగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా మాజీ మేయర్, రవీందర్ సింగ్ ,ఫారెస్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జడ్చర్ల మున్సిపాలిటీ పరిశీలకులుగా సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను నియమించగా వారు ఇప్పటికే ఆయా జిల్లాలకు చేరుకున్నారు.

ఇంచార్జులంతా శుక్రవారం ఉదయం కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో సమావేశమై సీల్డ్‌ కవర్లలలో అధిష్ఠానం ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను పరిశీలకులు వెల్లడించనున్నారు.
Published by:yveerash yveerash
First published: