muncipal mayors : మేయర్లు, చైర్మైన్లను ప్రకటించేది వీరే...ఆదేశాలు జారీ చేసిన సీఎం

సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

muncipal mayors : మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్, డిప్యూటి మేయర్లతో పాటు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శుక్రవారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల పరిశీలకుల పేర్లను ప్రకటించారు.

  • Share this:
    మున్సిపల్ కార్పోరేషన్లకు మేయర్, డిప్యూటి మేయర్లతో పాటు, ఐదు మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ శుక్రవారం కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల పరిశీలకుల పేర్లను ప్రకటించారు.

    కాగా పరిశీలకులంతా గురువారం సాయంత్రం ఆయా ప్రాంతాలకు చేరుకోవాలని పార్టీ ఆదేశించింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులను సమావేశపరిచి ఆయా కార్పోరేషన్లకు మేయర్లును, డిప్యుటీ మేయర్లును , మున్సిపాలిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు క్రమశిక్షణతో ఎన్నుకోవాలని సూచించింది.

    ఇక స్థానిక నేతల అభిప్రాయంతో పార్టీ నేతలు ఎప్పటికప్పుడు పార్టీ అధిష్టానంతో సంప్రదింపులు జరిపి
    మేయర్‌ను ఎన్నుకోనున్నారు. ఇందుకోసం పార్టీ అదిష్టానం అందచేసిన సీల్డు కవర్లలోని పేర్లతో ఎన్ని ప్రక్రియను నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆదేశించారు.

    కాగా ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పరిశీలకులుగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ
    నూకల నరేశ్ రెడ్డి ,
    వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల పరిశీలకులు మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , గంగుల కమలాకర్ ,
    కొత్తూరు మున్సిపాలిటీకి పరిశీలకులుగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
    నకిరేకల్ మున్సిపాలిటీ పరిశీలకులుగా టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెల్లపల్లి రవీందర్ రావు
    సిద్దిపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా మాజీ మేయర్, రవీందర్ సింగ్ ,ఫారెస్టు డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి
    అచ్చంపేట మున్సిపాలిటీ పరిశీలకులుగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
    జడ్చర్ల మున్సిపాలిటీ పరిశీలకులుగా సివిల్ సప్లయీస్ కార్పోరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డిలను
    నియమించారు.
    Published by:yveerash yveerash
    First published: