హోమ్ /వార్తలు /తెలంగాణ /

Corona help : సీఎం కేసీఆర్ బొమ్మతో.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి...?

Corona help : సీఎం కేసీఆర్ బొమ్మతో.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి...?

 సీఎం కేసీఆర్ బొమ్మతో.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి...?

సీఎం కేసీఆర్ బొమ్మతో.. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి...?

Corona help : రాజకీయాలను పక్కన పెట్టి కరోనా రోగులకు సహయం చేయడమే తన లక్ష్యమంటున్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అందుకే ఆయన ఫౌండేషన్ పై సీఎం కేసీఆర్‌తోపాటు ప్రధాని మోడి ఫోటోలను ముద్రించారు.

కరోనా సమయంలో రాజకీయాలను వీడి ప్రజలు అవసరాలను తీర్చడమే రాజకీయ నాయకుడి కనీస లక్షణం..కాని అందుకు విరుద్దంగా కొన్ని రాష్ట్రాల తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడ కరోనాపై విమర్శలు చేసుకుంటున్నాయి. పరిస్థితికి నువ్వుంటే నువ్వు.. కారణమంటూ రాజకీయ విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన పార్టీలు కనీస ధర్మాన్ని మరచిపోతున్నట్టు పలు విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే కొంతమంది మాత్రం రాజకీయ అంతర్గత విభేదాలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి ప్రజలకు కనీస సహాయం చేసేందుకు  ముందుకు వస్తున్నారు.

ఈటల ఎపిసోడ్‌లో ఆయనకు రాజకీయ మద్దతు పలికిన మాజీ ఎంపీ కొండా విశ్వేశర్ రెడ్డి ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే..కేసిఆర్ తో విభేధించి బయటకు వచ్చిన అనంతరం తాజాగా ఈటల రాజేందర్‌కు అంత్యంత సన్నిహితంగా ఉంటున్నారు. ఈటలను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసిన తర్వాత ఆయనకు బహిరంగంగా మద్దతు పలికిన వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారు. దీంతో రాజకీయ నిర్ణయాలపై సీఎం కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్న వారిలో కూడ ఆయన ఉన్నారు..


అయితే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన వ్యక్తిగత రాజకీయాలను పక్కన బెట్టి ప్రజల కోసం తనవంతు సహయం చేస్తున్నారు. తన ఫౌండేషన్ ద్వార  చేతనైన సహయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో కూడ శానిటైజర్ కొరత ఉన్న సంధర్బంలో స్వంతగా ఇళ్లలోనే శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలనే విధానాన్ని ప్రజలకు వివరించారు. దీంతో పాటు అంత్యంత తక్కువ ఖర్చుతో వెంటిలేటర్‌ను తయారు చేసి చూపించారు. ఇప్పుడు తాజాగా మరో మాస్క్‌ను అందించారు. దీని ద్వార వంద శాతం కరోనా వైరస్ నుండి బయటపడవచ్చని చెప్పారు. ముఖ్యంగా కరోనా వార్డుల్లో చికిత్స అందించే వారు సైతం దీన్ని ధరించవచ్చని చెప్పారు. అనంతరం ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు తన ఎక్సపర్‌మెంట్‌తో ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్స్  తయారు అందించారు.

ముఖ్యంగా సీఎం కేసీఆర్‌ తనను వద్దనుకున్నా. ఆయన మాత్రం కేసీఆర్ బొమ్మను జేకేఎమ్మార్ ఫౌండేషన్ కు చెందిన వ్యాన్‌కు అతికించారు. సీఎం కేసిఆర్ తోపాటు ప్రధాని మోడీ బోమ్మను మరోవైపు ముద్రించారు. ఈ నేపథ్యంలోనే ఆపత్కాలంలో అందరు కలిసి కట్టుగా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. వ్యక్తిగత విభేదాలను పక్కన బెట్టి కరోనాను జయించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్యశాఖ ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలని కోరారు.

మొత్తం మీద ఇలాంటీ సంఘటనలు రాజకీయంగా రగిలిపోయె నాయకులను పునరాలోచనలో పడే విధంగా చేస్తోంది. ఇలాంటీ సంధర్భంలో రాజకీయ విమర్శలు పక్కన బెటితే అటు ప్రజలకు ఇటు నాయకులకు కూడ భవిష్యత్ ఉండే అవకాశాలు ఉంటాయి.

First published:

Tags: CM KCR, Corona, Konda Vishweshwar reddy

ఉత్తమ కథలు