రేపటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు.. మందు బాబులకు పండగే..

తెలంగాణలో రేపటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు కానుంది. 2,216 మద్యం దుకాణాల లక్కీ డ్రా ద్వారా దుకాణాదారుల ఎంపిక పూర్తవ్వగా.. కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.975.68 కోట్ల ఆదాయం అందింది.

news18-telugu
Updated: October 31, 2019, 6:13 PM IST
రేపటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు.. మందు బాబులకు పండగే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలంగాణలో రేపటి నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమలు కానుంది. 2,216 మద్యం దుకాణాల లక్కీ డ్రా ద్వారా దుకాణాదారుల ఎంపిక పూర్తవ్వగా.. కేవలం దరఖాస్తుల ద్వారానే ప్రభుత్వానికి రూ.975.68 కోట్ల ఆదాయం అందింది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులను ఖరారు చేసి.. గతంలో ఉన్న నాలుగు స్లాబులను ఆరు స్లాబులకు పెంచిన విషయం తెలిసిందే. ఇక, మద్యం దుకాణాలు తెరిచి ఉంచే సమయాలను కూడా ప్రభుత్వం నిర్దేశించింది. 5000లోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షలు, ఐదు వేల నుంచి 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.55 లక్షలు, 50 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.60 లక్షలు, లక్ష నుంచి 5 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ. 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల మంది జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.85 లక్షలు, 20 లక్షలకుపైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.కోటి 10 లక్షల ఏడాది లైసెన్స్ ఫీజును నిర్ణయించారు. 2021 అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది.

ఇక, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

First published: October 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...