Home /News /telangana /

Liquor policy : ఆదాయమే ముఖ్యం.. ఒక్కపేరుతో అపరిమిత అప్లికేషన్లు.. పెరగనున్న మద్యం షాపులు

Liquor policy : ఆదాయమే ముఖ్యం.. ఒక్కపేరుతో అపరిమిత అప్లికేషన్లు.. పెరగనున్న మద్యం షాపులు

ఫైల్ ఫోటో..

ఫైల్ ఫోటో..

Liquor policy : రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం పాలసీని విడుదల చేసింది. దీంతో ఒక్క మద్యం దుకాణానికి ఒకే పేరుతో ఎన్ని ధరఖాస్తులైన చేసుకోవచ్చనే వెసులుబాటును కల్పించారు. దీంతో పాటు అదనపు షాపులతోపాటు రిజర్వేషన్ విధానాన్ని ఖరారు చేశారు.

  ఒక్క పేరుతో అపరిమిత టెండర్లు

  రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన మద్యం పాలసీలో కాసుల వసూళ్లే లక్ష్యంగా పాలసీని రూపోందించారు, ఈ క్రమంలోనే గతంలో టెండర్లలో ఉన్న కొన్ని నిబంధనలను సడలించారు. ఈ క్రమంలోనే ఒకే పేరుతో ఎన్ని అప్లికేషన్స్ అయినా పెట్టుకునే వెసులు బాటును కల్పించారు. కాగ గతంలో ఒక మద్యం షాపుకు ఒక పేరు మీద మాత్రమే ధరఖాస్తులు తీసుకున్నారు. దీంతో చాలా మంది ఆశవాహులు గ్రూపులుగా ఏర్పడి వివిధ పేర్ల మీద టెండర్లు వేసేవారు. దీంతో ఆ గ్రూపులో ఎవరికి టెండర్లు దక్కినా.. ఆ షాపును ఒప్పందాల ప్రకారం తీసుకునేవారు. కాని ఈ సంవత్సరం మాత్రం డబ్బులున్న వాడిదే పైచేయిగా పాలసీని రూపొందించారు. ఒక్క పేరుతో ఎన్ని టెండర్లు అయినా వేయవచ్చనే నిబంధనను తీసుకువచ్చారు. అయితే గతంలో విధించిన రెండు లక్షల్లో మాత్రం ఎలాంటీ మార్పు చేయలేదు.. దీంతో మద్యం టెండర్లు వేయాలనుకునే వారు రెండు లక్షల నాన్ రిఫండబుల్ అమౌంట్‌ను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

  రిజర్వేషతో షాపులు అదనం

  మరోవైపు నూతన పాలసీలో అదనంగా మద్యం షాపులకు అనుమతి ఇవ్వనున్నారు. దీంతో ఇప్పుడున్న షాపులకంటే 15 శాతం అధికంగా టెండర్లు పిలవనున్నారు. దీంతో సుమారు రెండు నుండి మూడు వందల షాపులు రాష్ట్రవ్యాప్తంగా అదనంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఉన్నాయి.

  ఇది చదవండి : నగర పోలీసులకు వింత అనుభవం.. డబ్బు కావాలా... నిందితులు కావాలా.. అంటూ ఆఫర్..


  ఆరు దఫాలుగా ఫీజు

  మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు ప్రకటించినట్టు మద్యం షాపుల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. వీటిలో గౌడలకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం మేర రిజర్వేషన్లు కూడా కల్పించనున్నారు. దీంతో పాటు వార్షిక ఫీజులో మార్పులు చేయకుండా వాటిని చెల్లింపు వాయిదాలను మాత్రం పెంచారు. గతంలో వార్షిక ఫీజును నాలుగు దఫాలుగా చెల్లించాల్సి రాగా ఈ సంవత్సరం మాత్రం ఆరు దఫాలుగా చెల్లించేందుకు అవకాశం ఇచ్చారు. మరోవైపు బ్యాంకు గ్యారంటీని సైతం 25 శాతానికి తగ్గించారు.

  అక్కడ రాత్రి 10 గంటల వరకే

  గతంలో మాదిరిగానే జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలోనే దుకాణాలను కేటాయించనున్నారు.

  జీహెచ్‌ఎంసీ వెలుపల ఐదు కిలోమీటర్ల వరకు కూడా నగరంలో వసూలు చేసే ఎక్సైజ్‌ పన్నే వర్తిస్తుందని నిబంధనల్లో పేర్కొన్నారు. అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా వాటి పరిధికి వెలుపల రెండు కిలోమీటర్ల వరకు అదే ఫీజు వర్తిస్తుందని స్పష్టంచేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10గంటల నుంచి రాత్రి 10గంటల వరకు తెరిచి ఉంటాయని నూతన పాలసీలో పేర్కొన్నారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు