హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: నాగార్జునసాగర్‌లో బీజేపీకి కొత్త తలనొప్పి.. నేతలకు బండి సంజయ్ క్లాస్

Telangana: నాగార్జునసాగర్‌లో బీజేపీకి కొత్త తలనొప్పి.. నేతలకు బండి సంజయ్ క్లాస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nagarjuna Sagar By election: బీజేపీ తరపున టికెట్ తమకే వస్తుందనే ధీమాతో కొందరు నేతలు అప్పుడే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కాస్త ఎక్కువ కావడంతో.. దీనిపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.

  తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను రాజకీయంగా సవాల్ చేసే స్థాయికి ఎదుగుతున్న బీజేపీ.. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ద్వారా వచ్చిన అనుకూల ఫలితాలను నాగార్జునసాగర్‌లోనూ కొనసాగించాలని భావిస్తున్న బీజేపీ.. ఈ విషయంలో ఏ మాత్రం తప్పటడుగులు వేయొద్దని భావిస్తోంది. తెలంగాణలో తమకు ప్రస్తుతం వీస్తున్న అనుకూల పవనాలను అందిపుచ్చుకుంటే.. నాగార్జునసాగర్‌లోనూ విజయం సాధించవచ్చని ఆ పార్టీ అంచనా వేసుకుంటోంది. అయితే సాగర్‌లో కచ్చితంగా గెలవాలని భావిస్తున్న బీజేపీకి.. అక్కడి నేతల తీరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందని తెలుస్తోంది. నాగార్జునసాగర్‌లో బీజేపీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగాలనే దానిపై ఆ పార్టీ ఇంకా ఓ క్లారిటీకి రాలేదు. అయితే గతంలో ఇక్కడి నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన నివేదితారెడ్డి, ఇతర పార్టీ నుంచి పోటీ చేసి ఆ తరువాత బీజేపీలో చేరిన అంజయ్య యాదవ్ వంటి నేతలు అప్పుడే బీజేపీ తరపున ప్రచారం మొదలుపెట్టారు. బీజేపీ తరపున టికెట్ తమకే వస్తుందనే ధీమాతో అప్పుడే ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది కాస్త ఎక్కువ కావడంతో.. దీనిపై బీజేపీ నాయకత్వం ఫోకస్ పెట్టింది.

  ఎవరికివారే ప్రచారం చేయడంపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని ఆయన పార్టీ కార్యకర్తలను హెచ్చరించారు. టికెట్ ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేసుకోవాలని నియోజకవర్గం నేతలకు బండి సంజయ్ సూచించారు. సాగర్ నేతల తీరుపై తెలంగాణ బీజేపీ ఇంఛార్జ్ తరుణ్‌చుగ్ కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎవరికి వాళ్లు ప్రచారం చేసుకోవడం వల్ల ఆ తరువాత పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థికి ఇబ్బందులు ఎదురవుతాయని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం.

  Telangana bjp news, raja singh news, bandi sanjay news, telangana bjp new committee, telangana news, తెలంగాణ బీజేపీ వార్తలు, రాజా సింగ్ న్యూస్, బండి సంజయ్ న్యూస్, తెలంగాణ బీజేపీ కొత్త కమిటీ, తెలంగాణ న్యూస్
  బండి సంజయ్ (ఫైల్ ఫోటో)

  మరోవైపు నాగార్జునసాగర్‌‌లోని బీజేపీ నేతల మధ్య విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను బండి సంజయ్ ఖండించారు. సాగర్‌లో గెలుపు తమదే అని.. అందుకే అక్కడి నుంచి పోటీ చేసేందుకు తమ నేతలు పోటీ పడుతున్నారని చెప్పుకొచ్చారు. అయితే అక్కడ బరిలోకి దిగబోయే అభ్యర్థి విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. మొత్తానికి నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్న బీజేపీకి.. స్థానిక నేతల తీరు మింగుడుపడకుండా మారినట్టు అర్థమవుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bandi sanjay, Bjp, Nagarjuna Sagar By-election, Telangana

  ఉత్తమ కథలు