లాక్‌డౌన్‌పై తెలంగాణ తాజా ఉత్తర్వులు జారీ

కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: July 1, 2020, 9:35 AM IST
లాక్‌డౌన్‌పై తెలంగాణ తాజా ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని వెల్లడించింది. అయితే వీటి నుంచి ఎమర్జెన్సీ సేవలకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు రాత్రి 9.30 గంటల కల్లా అన్ని షాపులు మూసేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. లాక్‌డౌన్ నిబంధనలు అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశించింది. కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇక రెండు రోజుల క్రితం లాక్‌డౌన్ నుంచి మరిన్ని సడలింపులు ఇచ్చింది కేంద్రం. అన్ లాక్-2కి సంబంధించి మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి విడుదల చేసింది. దీని ప్రకారం.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కంటైన్‌మెంట్ జోన్లలో మాత్రం జూలై 31 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. కేవలం అత్యవసర సేవలకు మాత్రమే అక్కడ అనుమతి ఉంటుంది. దేశమంతటా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. నైట్ కర్ఫ్యూలో నిత్యాసవర సరుకులు రవాణా చేసే వాహనాలు, పరిశ్రమలకు మాత్రమే అనుమతి ఉంటుంది. రాత్రవేళ రైళ్లు, విమానాలు, బస్సుల్లో వెళ్లేవారికి అనుమతి ఉంటుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలకు తగ్గట్టుగానే ఉత్తర్వులు జారీ చేసింది.

First published: July 1, 2020, 9:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading