NEW FLYOVER INAGURATED BY MINISTER KTR AT MIDHANI TO OWAISI CENTER VRY
KTR : ఆ ఫ్లై ఓవర్‌కు అబ్దుల్ కలాం పేరు... ప్రారంభించిన మంత్రి కేటిఆర్..!
New flyover inagurated by minister ktr
KTR : హైదరాబాద్ మహానగరంలో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. విపరీతమైన ట్రాఫిక్ ఉండే మిథాని, ఓవైసీ సెంటర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటిఆర్ ఎమ్ఐఎమ్ నేతలతో పాటు మంత్రులు, మేయర్‌తో కలిసి ప్రారంభించారు.
హైదరాబాద్ నగరంలోని ఓవైసీ సెంటర్ నిర్మించిన ప్లై ఓవర్‌ను పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. మూడు లైన్లలో 12 మీటర్ల వెడల్పుతో వన్‌వే మార్గంగా మిథాని జంక్షన్ నుంచి ఓవైసీ జంక్షన్ వరకు 1.36 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ ప్లైఓవర్ పైన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అత్యంత వాహన రద్దీగల ఎల్బినగర్-ఆరాంఘర్ మార్గంలో ఓవైసీ జంక్షన్ వద్ద ప్లైఓవర్ నిర్మాణం చేపట్టారు. మొత్తం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.80 కోట్లు కాగా ఇందులో రూ.63 కోట్లు ప్లైఓవర్ నిర్మాణానికి, మిగిలిన రూ.17 కోట్లు భూసేకరణకు ఖర్చు చేశారు.
కాగా ఈ ఫ్లైఓవర్‌కు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపేరును పెడుతున్నట్టు చెప్పారు. దీనిపై మంత్రి కేటిఆర్ తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. డీఆర్డీఓలో పనిచేసిన మేధావి అబ్దుల్ కలాంకు ఇదే మా నివాళి అంటూ పేర్కోన్నారు. ఇదే ప్రాంతంలో అబ్దుల్ కలాం పదిసంవత్సరాల పాటు నివాసం ఉన్నారని తెలిపారు. ఇది తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇచ్చిన అరుదైన గౌరవం అని చెప్పారు.
దక్షిణాది ప్రాంతంలో ఫ్రీ క్యాస్ట్ టెక్నాలజీతో నిర్మించిన తొలిప్లైఓవర్ ఇదే కావడం విశేషం. ఈ మార్గంలో అత్యధికంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండడంతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్‌కు వెళ్లే మార్గం కూడా కావడంతో ట్రాఫిక్ సమస్య తలేత్తకుండా వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు కాలుష్య నివారణ చర్యలకు మార్గం సుగమణమైంది. కాగా ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.