Home /News /telangana /

NEW COURSES ARE INTRODUCED IN ITI COLLEGES IN SANGA REDDY ABH MDK

Sangareddy: విద్యార్థులకు సువర్ణావకాశం.. కొత్తగా ఐటిఐ లో రెండు కోర్సులు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

విద్యార్థులు ఐటిఐ చేస్తే మంచి భవిష్యత్తు తో పాటు ఉపాధి లభిస్తుంది, సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకోని సంగారెడ్డి జిల్లా కు కోత్తగా మరో రెండు ట్రేడ్స్ వచ్చాయి

    (K. Veeranna, News 18, Medak)

    విద్యార్థులు ఐటిఐ చేస్తే మంచి భవిష్యత్తు తో పాటు ఉపాధి లభిస్తుంది, సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో పెట్టుకోని సంగారెడ్డి జిల్లా కు కోత్తగా మరో రెండు ట్రేడ్స్ వచ్చాయి. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్ని తీర్చిదిద్దాలి. తద్వారా ఉపాధి, ఉద్యోగావకాశాలకు మార్గం సుగమం అవుతుంది. ఇదే ఉద్దేశంతో ప్రభుత్వం  పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)లను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో స్వయం ఉపాధిలోనూ రాణించేలా కొత్త ట్రేడ్ పై సాంకేతిక విద్యా శాఖ దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐకి రెండు కొత్తట్రేడ్లను మంజూరు చేసిన నేపథ్యంలో పాత జిల్లాల ప్రాతిపదికన జిల్లాలో నాలుగు ప్రభుత్వఐటీఐలు ఉన్నాయి. సంగారెడ్డి, హత్నూర, పటాన్చెరులో నిర్వహిస్తున్నారు. వీటితో పాటు మరో 15 ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వాటితో కలిపి మొత్తం 5,470 మంది విద్యార్థులు ఉన్నారు. పాత జిల్లాల ప్రాతిపదికన అన్ని సదుపాయాలు ఉన్న ఐటీ కొత్త ట్రేడ్లను ప్రవేశపెట్టాలని సాంకేతిక విద్యాశాఖనిర్ణయించింది.

    సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త ట్రేడ్ లో ప్రవేశాలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండూ డిమాండ్ ఉన్నవే.సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో ఇప్పటికే 11 ట్రేడ్లు అందుబాటులో ఉన్నాయి. ఆయా ట్రేడుల్లో కలిపి 800 మంది విద్యార్థులు ఉన్నారు. వీటికి తోడు ఫ్యాషన్డిజైన్ టెక్నాలజీ(ఎఫ్టీ), మెకానిక్ మోటార్ వెహికిల్ ట్రేడ్లను ప్రారంభించేందుకు ఇప్పటికే అనుమతులు వచ్చాయి. కాగా ప్రవేశాలపై మార్గదర్శకాలు అందాల్సి ఉంది. ఇప్పటికే పాత కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొత్త కోర్సులకు రెండో విడత ప్రవేశాల సమయం నుంచి దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. కొత్తగా ప్రారంభించనున్న రెండు కోర్సులూ డిమాండ్ ఉన్నవే కావడం విశేషం. కోరు పూర్తిచేయగానే స్వయం ఉపాధికి బాటలు వేసుకునేందుకు వీలుంటుంది.

    ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో చేరేందుకు విద్యార్థినులకు మాత్రమే అవకాశం కల్పించనున్నారు.అనుమతులు రాగానే దరఖాస్తుల స్వీకరణ ఐటీఐ వైస్ ప్రిన్సిపల్ అనంద్  ఐటీఐలో కొత్తగా రెండు ట్రేడ్లను సాంకేతిక విద్యాశాఖమంజూరు చేసింది. ఈ ట్రేడుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణకు అనుతులు రావాల్సి ఉంది. అనుమతులు రాగానే  మీసేవ ద్వారా అన్లైన్ లో  దరఖాస్తులు చేసుకోవాలి  విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త కోర్సుల్లో చేరే విద్యార్థులకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: EDUCATION, Medak Dist, New courses, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు