కొత్తగా కరోనా వైరస్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో కరనో భయం మరోసారి రాష్ట్రంలో వెంటాడుతోంది. కేసులన్ని తగ్గుముఖం పట్టి ఇప్పడిప్పుడే ప్రజలు కాస్తా రిలాక్స్ అవుతున్న నేపథ్యంలోనే కొత్త వేరియంట్ విజృంభిస్తోంది. ( New corona cases in Telangana ) దీంతో మరోసారి రాష్ట్రంలో కరోనా కేసులు నమోదుతో పాటు మరణాలు చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణలో కరోనా కేసులు మాములుగానే నమోదు అవుతున్నాయి.. గడచిన 24 గంటల్లో 32,540 నమూనాలు పరీక్షించగా..( New corona cases in Telangana ) కొత్తగా 160 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల ఒకరు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య రాష్ట్రంలో 3,988కి చేరింది. కరోనా బారి నుంచి నేడు 148 మంది పూర్తిగా కోలుకున్నారు.( New corona cases in Telangana ) రాష్ట్రంలో ప్రస్తుతం 3,545 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది.
Aadilabad : చాలన్లు వేస్తున్నారని పోలీసుల ముందే..తన బైకుకు తానే నిప్పు.
Revanth reddy : ధాన్యం కొనుగోలు చేయకపోతే... మోదీ, కేసీఆర్లకు నడిబజార్లో ఉరి ఖాయం..!
ఇదిలా ఉంటే.. టెక్ మహీంద్ర వర్సిటీలో కరోనా కలకలం సృష్టించింది. వర్సిటీలో 25 మంది విద్యార్థులు, ఐదుగురి టీచింగ్ స్టాఫ్కు కొవిడ్ సోకింది. దీంతో స్థానిక వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. డీఎంహెచ్వో మల్లికార్జున్ వర్సిటీని పరిశీలించారు. ( New corona cases in Telangana ) ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 30 మంది కరోనా బాధితులు ఉన్నట్లు తెలిపారు. వర్సిటీ సిబ్బందికి, సమీపంలోని దుకాణదారులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ( New corona cases in Telangana ) కరోనా నేపథ్యంలో వర్సిటీకి 15 రోజుల సెలవు ప్రకటించినట్లు వెల్లడించారు. అయితే పాజిటివ్ వచ్చిన వారంతా టీకా రెండు డోసులు తీసుకున్నవారేనని చెప్పారు.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona casess, Telangana