హోమ్ /వార్తలు /తెలంగాణ /

Huzurabad : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి కొత్త పేర్లు...రేవంత్ సారథ్యం తర్వాత మారుతున్నపరిణామాలు

Huzurabad : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెరపైకి కొత్త పేర్లు...రేవంత్ సారథ్యం తర్వాత మారుతున్నపరిణామాలు

వీటితో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వంటి అంశాలను లేఖలో పొందుపరిచారు. రేవంత్ రెడ్డి తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆరోపించారు.

వీటితో పాటు హుజురాబాద్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వంటి అంశాలను లేఖలో పొందుపరిచారు. రేవంత్ రెడ్డి తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆరోపించారు.

Huzurabad : హుజురాబాద్‌లో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి..పార్టీ అభ్యర్థులపై కసరత్తు చేస్తున్న ఆయా పార్టీలు..తమ అభ్యర్థుల పరీశీలనలో మునిగిపోయాయి.. ఈటలకు దీటుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. దీంతో కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి.

ఇంకా చదవండి ...

  కరీంనగర్ జిల్లా.

  న్యూస్18 తెలుగు కారస్పాండెంట్. శ్రీనివాస్. పి..

  మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనున్నాయి. ఈ క్రమంలో అక్కడి రాజకీయాలు ఇప్పటినుండే వేడెక్కుతున్నాయి . ఈటల బలమైన నేత కావడం , మాజీ మంత్రిగా పనిచేయడం , ఆయనను ఓడిచేందుకు అధికార టీఆర్ఎస్ ఇప్పటినుంచే ప్రయత్నాలు చేస్తుండటంతో .. హుజురాబాద్ ఉపఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది . ఈ సంధర్భంలోనే తమ బలాబలాలను నిరూపించుకునేందుకు పార్టీలన్నీ కీలక నేతలను రంగంలోకి దింపి హుజురాబాద్‌లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి .

  ఈటలను ఢీకొట్టేందుకు మిగతా పార్టీలు కూడా బలమైన అభ్యర్థులను పోటీలోకి దిపేందుకు కసరత్తు చేస్తున్నాయి . టీఆర్ఎస్ , బీజేపీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటినుంచే వ్యూహరచనలు చేస్తోంది . టీఆర్ఎస్ అభ్యర్థిగా శనివారం మంత్రి హరీష్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న కోరం సంజీవరెడ్డి పేరు ప్రముఖంగా రేసులో వినిపిస్తుండగా .. ప్రతిపక్ష కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పేరు బాగా వినిపిస్తోంది . ఎందుకంటే రేవంత్‌ రెడ్డికి అనుకూలంగా ఆయన చేపట్టిన కార్యక్రమాల్లో పొన్నం ప్రభాకర్ నిలుస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగింపు సభకు సీనియర్లు వారించినా .. పొన్నం ప్రభాకర్ మాత్రం హాజరై రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు . దీంతో పొన్నం ప్రభాకర్ కు హుజురాబాద్ టికెట్ ను కేటాయించే యోచనలో రేవంత్ ఉన్నట్లు సమాచారం .

  రేవంత్ పీసీసీ చీప్ నియామాకం అయిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో .. హుజురాబాద్‌లో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి ఉన్నారు . దీంతో తన సన్నిహితుడైన పొన్నం ప్రభాకర్ వైపే రేవంత్ మొగ్గు చూపుతున్నారని సమాచారం . మొన్నటివరకు హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ , మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బంధువు కౌశిక్ రెడ్డి పేరు వినిపించింది . అయితే దేవరయాంజల్ భూముల విషయంలో కాంగ్రెస్ లైన్‌కు వ్యతిరేకంగా కౌశిక్ రెడ్డి పనిచేయడం , ఒక కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు జరపడంతో .. టీఆర్ఎస్‌ అనుగుణంగా ఆయన వ్యవహరిస్తున్నానే టాక్ నడించింది . దీంతో కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ టికెట్ ఇచ్చే అవకాశాలు లేవనే చర్చ నియోజకవర్గంలో జోరుగా జరుగుతోంది .

  ఏది ఏమైనప్పటికీ పీసీసీ వచ్చిన తరువాత రేవంత్ రెడ్డి‌కి మొదటి ఎన్నిక కాబట్టి హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేస్తున్నట్లు కనబడుతోంది..కాంగ్రెస్ పార్టీలో అందరని కలుపుకుపోతానని ఇప్పటికే పలు వేదికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి.. అభ్యర్థి ఎంపికతోపాటు ఎన్నికల్లో కూడా సీనియర్లను కలుపుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Congress, Huzurabad, Huzurabad By-election 2021, Telangana News, Telugu news

  ఉత్తమ కథలు