Home /News /telangana /

NEW BRIDE DIES OF BRAIN DEAD IN MEDAK DISTRICT OF TELANGANA SNR MDK

Telangana: పెద్దల్ని ఒప్పించి నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకుంది .. 18రోజులకే ఏం జరిగిందో తెలుసా

(పెళ్లైన 18రోజులకే..)

(పెళ్లైన 18రోజులకే..)

Telangana:ఆమె ప్రేమ ఫలించింది. నచ్చిన వాడినే మనువాడాలన్న కోరిక నెరవేరింది. కాని కోరుకున్న వాడితో కలిసి నూరేళ్లు జీవితాన్ని పంచుకోవాలనుకుంది. ఇంతలోనే ఆ నవ వధువును మృత్యువు ఆవహించింది.

చాలా ప్రేమకథలు విషాదంగానే ముగుస్తాయి. ప్రేమించుకున్న జంట ఒక్కటయ్యే వరకు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. మెదక్‌( Medak)జిల్లాలో ఓ ప్రేమజంట కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంది. రెండు వైపుల కుటుంబ సభ్యులను ఒప్పించి వారి సమక్షంలోనే గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. నూరేళ్లు కలకలాం సంతోషంగా గడవాల్సిన ఆ ప్రేమజంట కాపురంలో మూడు వారాలు కూడా గడవక ముందే విషాదం నెలకొంది. నచ్చిన వాడ్ని పెళ్లి చేసుకున్న ఆ యువతి అతడ్ని ఒంటరి వాడ్ని చేసి శాశ్వతంగా దూరమైన ఘటన అందర్ని తీవ్రంగా బాధించింది. మెదక్ టౌన్‌కి చెందిన రాఘవేంద్ర(Raghavendra)అనే యువకుడు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)పార్వతీపురాని(Parvatipuram)కి చెందిన ఉష(Usha)అనే 23సంవత్సరాల యువతికి హైదరాబాద్‌(Hyderabad)లో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది.

ఆనంద సమయంలో విషాదం..
రాఘవేంద్ర, ఉషా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే ఇద్దరివి వేర్వేరు సామాజికవర్గాలు కావడంతో పెద్దలు వీరి ప్రేమ వివాహాన్ని అంగీకరించలేదు. వాళ్ల ప్రేమలో సిన్సియారిటీ పెద్దల మనసుల్నికరిగించింది. ఆంధ్రాలో ఉండే అమ్మాయి ఉషా ఫ్యామిలీని తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఉండే రాఘవేంద్ర కుటుంబాన్ని దగ్గరకు చేసింది. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు ఉషా, రాఘవేంద్ర పెళ్లికి అంగీకరించారు. ఇదే నెల 11వ తేదిన హైదరాబాద్‌లో ఓ హోటల్‌లో వీరి వివాహాన్ని గ్రాండ్‌గా నిర్వహించారు.

వివాహితను వెంటాడిన మృత్యువు..
ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఒప్పించి ప్రేమవివాహం చేసుకున్నారు ఉషా, రాఘవేంద్ర. రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు సంతోషంగా ఉన్న సమయంలో వినకూడని వార్త వారి చెవిన పడింది. ఆ కారణంతో పెళ్లి అయిన కొద్ది రోజుల్లోనే ప్రేమజంట శాశ్వతంగా విడిపోతుందని వాళ్లు ఊహించలేకపోయారు. నవ వధువు ఉషకు తలనొప్పి రావడంతో స్థానికంగా ఉండే ఆసుపత్రిలో చూపించారు. అక్కడి వైద్యుడు హైదరాబాద్‌కు తీసుకెళ్లమని సూచించారు. ఉషను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చూపించారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వధువు ఉషకు బ్రెయిన్‌ స్ట్రోక్ వచ్చిందని..ఆమె ప్రాణాలు కాపడటం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పారు. కేవలం పెళ్లి చేసుకున్న 18రోజుల్లోనే నవవధువు ప్రాణాలు విడిచింది.

(పెళ్లైన 18రోజులకే..)
(పెళ్లైన 18రోజులకే..)


కోరుకున్న ప్రియుడ్ని వదిలి..
పట్టుమని 15రోజులు కాపురం చేసిన ఉష తమను ఇలా అర్ధాంతరంగా వదిలి శాశ్వతంగా దూరమవడాన్ని రెండు కుటుంబాల సభ్యులు జీర్ణించుకోలేకపోయారు. ఉష అవయవాలు దానం చేయాలని భావించినప్పటికి శరీరంలోని అవయవాల్లోకి నీరు చేరడం కారణంగా సాధ్య పడదని డాక్టర్లు చెప్పడంతో తదుపరి జరగాల్సిన కార్యక్రమాల్ని నిర్వహించే పనిలో ఉన్నారు.
Published by:Siva Nanduri
First published:

Tags: Medak, Women died

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు