NEW BATUKAMMA SONG RELEASED BY MLC KAVITH AND AR RAHMAN COMPOSING MUSIC TODAY VRY
Bathukamma Special song : జాగృతి, బతుకమ్మ పాట రిలీజ్.. ఏర్ రెహ్మన్ సంగీతం ,గౌతమ్ మీనన్ దర్శకత్వం
Bathukamma Special song : జాగృతి, బతుకమ్మ పాట రిలీజ్..
Bathukamma Special song : తెలంగాణ జాగృతి నిర్మించిన బతుకమ్మ పాటను దర్శకుడు వాసుదేవ మీనన్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. కాగా ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూర్చారు.
తెలంగాణకు తలమానికమైన బతుకమ్మ పాటకు ఈ సంవత్సరం మరింత పాపులారిటీ రానుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఏర్ రెహమాన్ (AR Rahman) సంగీతంతో పాటు మరో ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరక్షన్లో మిట్టపల్లి సురెందర్ రాసిన పాటను తెలంగాణ జాగృతి నిర్మించింది. కాగా ఈ పాటకు తెలంగాణకు చెందిన మిట్టపల్లి సురేందర్ (Mittapalli surender ) పాట రాయగా జాతీయ అవార్డు గ్రహిత బ్రిందా కోరియోగ్రఫి అందించారు.
అయితే ఈ పాటను అల్లిపూల వెన్నల పేరుతో విడుదల చేసిన కవిత బతుకమ్మ పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి పేరుతో బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసిన కవిత గత మూడు సంవత్సరాలుగా బతుకమ్మ ఉత్సవాలకు దూరంగా ఉంటుంది. కోవిడ్‌తో పాటు పలు రాజకీయా కారణాలతో ఆమె ఉత్సవాలకు దూరంగా ఉన్నా.. ఈ సంవత్సరం మాత్రం పెద్ద ఎత్తున బతుకమ్మ పాటను ప్రజల్లో తీసుకువెళ్లెందుకు ప్లాన్ చేశారు.
ఈ క్రమంలోనే సంవత్సరం బతుకమ్మ పాట ( New Bathukamma song ) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిని మరింత ఆకర్షించనుంది. ఇప్పటికే పలు దేశాల్లో బతుకమ్మ పాటకు క్రేజ్ ఉన్న నేపథ్యంలోనే ఈ సంవత్సరం ఆ పాట మరింత ఆదరణ పొందనుంది.. ఈ పాట చిత్రీకరణ కోసం సినీ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తుల ఆధ్వర్యంలో బతుకమ్మ పాటను నిర్మించడం. ఓ ప్రత్యేకత కాగా.. ఈ క్రమంలోనే అంతర్జాతీయా స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహిత ఏఆర్ రెహమాన్ (AR rahman ) సంగీత దర్శకత్వంతో పాటు ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌లు ( Gautham Vasudev Menon)కలిసి బతుకమ్మ పాటను రూపొందించారు. కాగా ఈ పాటను తెలంగాణకు చెందిన ప్రముఖ గాయకుడు మిట్టపల్లి సురేందర్ రాయగా జాతీయ అవార్డు గ్రహిత బ్రిందా కోరియోగ్రఫి అందించారు.
మరోవైపు రెహమాన్ సంగీతం వహించిన పాటతోనే జాగృతి నేతలు బతుకమ్మ ఉత్సవాలను సెలబ్రేట్ చేసేందుకు కూడా సన్నహాలు చేస్తున్నారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ ద్వారా బతుకమ్మ శుభాకాంక్షలను తెలిపారు. ఈ నేపథ్యంలోనే బతుకమ్మ ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న తరుణంలో తాము రూపోందించిన అల్లిపూల బతుకమ్మ పాట మరింత శోభను తీసుకువస్తుందని ఏర్ రెహమాన్ ట్విట్టర్ ద్వారా తన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ బృందం బతుకమ్మ పాటను గత నెల 29, 30 వ తేదీల్లో తెలంగాణలోని యాదాద్రీ భువనగిరి (yadardi )జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామంలో షూట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం పాటను 5 నిమిషాల నిడివిగల వీడియోతో రూపోందించారు. కాగా పాటను బతుకమ్మ పాటను ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో గౌతమ్ మీనన్‌తో కలిసి విడుదల చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.