Hyderabad News: మీకు రూ.30 వేలు కావాలా.. అయితే ఈ పని చేసిపెట్టండి..

ప్రతీకాత్మక చిత్రం

Lost Dog: హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం త‌ప్పిపోయిన త‌మ కుక్క‌ను వెతికిపెడితే రూ.30 వేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. దాని పేరు డాలి అని.. ఆ కుక్క తెలుపు రంగులో ఉంటుందని.. ఆచూకీ తెలిపిన వారు కింద తెలిపిన నంబర్‌కు సమాచారం అందించాల‌ని.. వారికి రూ.30 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు.

 • Share this:
  ఇటీవల సైదాబాద్ లో చిన్నారి హత్య, అత్యాచార ఘటనలో నిందితుడిని పట్టిస్తే వాళ్లకు రూ.10లక్షలు నజరానాను ఇస్తామని పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మనుషులు ఇంటి నుంచి తప్పిపోతే వాళ్ల కోసం వెతకడం.. కనపడకపోతే పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తుంటాం.కానీ ఇక్కడ ఓ ఘటనలో ఇంటి నుంచి ఓ శునకం తప్పిపోయిందని.. దానిని వెతికి పట్టుకొని వస్తే..రూ. 30 వేలు ఇస్తామని ప్రకటించారు ఆ కుక్క యజమని. ఇది ఎక్కడనో అనుకునేరు.. మన హైదరాబాద్ లోనే. హైదరాబాద్ కు చెందిన ఒక కుటుంబం త‌ప్పిపోయిన త‌మ కుక్క‌ను వెతికిపెడితే రూ.30 వేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఖైరతాబాద్‌, చింతల బస్తీకి చెందిన టి.పుష్పప్రియ, టి.శేషావతరం లు కొంత‌కాలంగా ఒక కుక్క‌ను పెంచుకుంటున్నారు. దాని పేరు డాలిగా వాళ్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వాళ్లు హైదర్‌గూడలోని ఎన్‌ఎస్ఎస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జంతు వులంటే తమకు ఎంతో ఇష్టమని గత 12 ఏండ్ల నుంచి ఇండియన్‌ డాగ్‌(డాలి)ని పెంచుకుంటున్నామని తెలిపారు.

  ఫిబ్రవరి 7 న బయటకు వెళ్లిన తమ కుక్క తిరిగి ఇంటికి రాకపోవడంతో అప్పటి నుంచి ఆచూకి కోసం గాలిస్తున్నామన్నారు. ఇంత వరకు ఆ డాలీ కనిపించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి ఎవరికైనా దొరికితే మాకు అప్పగించండి అంటూ వేడుకున్నారు. గత 7 నెలల నుంచి కుక్క ఆచూకీ కోసం కరపత్రాలు, ప్లకార్డులు తయారు చేసి పంపిణీ చేయడం తో పాటు జీహెచ్‌ఎంసీ సంబంధిత అధికారులకు ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  కుక్కకు స్నానం చేయించిన తరువాత బెల్ట్ వేయడం మర్చిపోవడం వల్లే తప్పి పోయిందన్నారు. ఆ కుక్క తెలుపు రంగులో ఉంటుందని.. ఆచూకీ తెలిపిన వారు 9581054010 నంబర్‌కు సమాచారం అందించాల‌ని.. వారికి రూ.30 వేలు నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. అయితే ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కువగానే జరుగుతున్నాయి.. కానీ ఒక శునకం తప్పిపోయి ఏడు నెలల తర్వాత కూడా దానిపై మమకారంతో ఇంకా వెతుకుతున్నారంటే.. వాళ్లు ఆ డాలీపై ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు.

  Hyderabad Crime: హైదరాబాద్ లో మరో దారుణం.. దుకాణం షెట్టర్‎లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారయత్నం..


  ఇదిలా ఉండగా.. తరచూ అభిమానులతో సామాజిక మాధ్యమాల వేదికగా టచ్​లో ఉంటోంది నటి నిధి అగర్వాల్. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటుంది. అయతే రెండు నెలల క్రితం ఆమె కుక్క తప్పిపోయిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పట్టించిన వారికి రివార్డు లభిస్తుందని కూడా పేర్కొంది. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న 'ఇస్మార్ట్ శంకర్' భామ నిధి అగర్వాల్ సామాజిక మాధ్యమాల్లోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. తరచూ తనకు సంబంధించిన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఆమె ఓ కుక్కకు సంబంధించిన పోస్ట్​ను నెట్టింట షేర్ చేసింది.

  Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


  ఆ కుక్క పేరు కోకో అని అది కనిపించకుండా పోయిందని తెలిపింది. అలాగే ఆ పెట్​ను పట్టిస్తే లక్ష రూపాయల రివార్డు కూడా లభిస్తుందని అందులో పేర్కొంది. దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్​ను కూడా పొందుపరిచింది. ఇలా ఆమె పోస్టు చేసి రెండు నెలలు దాటింది. ఇలా కుక్కలపై అభిమానం చంపుకోలేక.. సొంత మనిషికి పంచిన అప్యాయతలను వాటికి కూడా పంచుతారు. పై రెండు ఘటనలు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా.. వాళ్లు జంతు ప్రేమికులు అని.
  Published by:Veera Babu
  First published: