Village Sarpanch: వలపు వలలో సర్పంచ్ విలవిల.. ఒంటరిగా ఇంట్లో అద్దెకు ఉంటున్న మహిళపై..

ప్రతీకాత్మక చిత్రం

Village Sarpanch: తనకు ఆస్తి రాసివ్వకపోతే సర్పంచ్ లైంగికంగా వేధించాడని వెళ్లి పోలీసులకు కేసు పెడతానంటూ ఓ మహిళ బెదిరించింది. దీని నుంచి రక్షించుకునేందుకు ఆయన పడరానిపాట్లు పడుతున్నాడు. అటు పోలీస్‌ కేసు, ఇటు మహిళ బ్లాక్‌ మెయిల్‌ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

  • Share this:
    ఆమెకు ఆర్థికంగా బలంగా ఎవరు ఉన్నారని చూస్తుంది. అదను చూసి వాళ్ల ఇంట్లో అద్దెకు దిగుతుంది. కొన్ని రోజుల వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత మొదలవుతుంది ఆమె నాటకం. ఇంటి యజమాని తనను లైంగికంగా వేధించాడని.. ఇలా పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేస్తానంటూ బెదిరిస్తుంది. ఇలా చేయకుండా ఉండాలంటే డబ్బులు లేదా సంగం ఆస్తి రాసివ్వాలంటూ కోరుతుంది. వినకపోతే నిజంగానే వెళ్లి పోలీసులకు పిర్యాదు చేస్తుంది. ఇలాంటిదే కామారెడ్డి జిల్లోలో ఒకటి చోటు చేసుకుంది. తనకు ఆస్తి రాసివ్వకపోతే లైంగికంగా వేధించావంటూ కేసు పెడతానంటూ గ్రామసర్పంచ్‌ను ఆ మహిళ బెదిరించింది. దాంతో భయపడిపోయిన సర్పంచ్.. తానూ ఎవరిపట్లా అసభ్యంగా ప్రవర్తించలేదని పోలీస్ ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లాడు. దాంతో పోలీసులు.. బ్లాక్‌మెయిల్ చేసిన మహిళ వ్యవహారంపై కూపీ లాగుతున్నారు. దీంతో ఆమె వ్యవహారం అంతా భయట పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో మారుమూల ఓ మరుమూల గ్రామానికి సర్పంచ్ జిల్లా కేంద్రం అయిన కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయనకు కాకతీయ నగర్‌లో రెండస్తుల ఇళ్లు ఉంది.

    సదరు ప్రజాప్రతినిధి ఇంటి అడ్రస్‌ను పట్టుకుని వచ్చిన మహిళలు తమకు ఇళ్లు కిరాయి కావాలంటూ అడిగారు. అందులో ఓ యువతి మర్యాదగా మాట్లాడుతూ.. తనకు కష్టాలు ఉన్నాయంటూ నమ్మించి ఇళ్లు కిరాయికి ఇచ్చేలా చేసుకుంది. ఆ అద్దె ఇంట్లో చేరిన ఆ మహిళ కొద్ది రోజులకే సదరు సర్పంచ్ తో గొడవ మొదలు పెట్టింది. నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని లేదంటే తనను లైంగికంగా వేధింనట్లు పోలీ సులకు ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది. అతడు మొండిగా వ్యవహరించడంతో ఆమె దేవునిపల్లి పోలీసులను ఆశ్రయించింది. ఒంటరిగా ఉన్న తన వద్దకు సదరు సర్పంచ్ వచ్చి లైంగికంగా వేధించాడని వాపోయింది.

    అక్కడ పోలీసులు మహిళ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశారు. దీనిపై సర్పంచ్ మాట్లాడుతూ.. తాను ఆ మహిళను అసభ్యకరంగా ప్రవర్తించలేదని ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధితో మొరపెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త ఉన్నత పోలీస్ అధికారుల దాకా వెళ్లిపోయింది. ఆ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారంపై పోలీస్‌ ఉన్నతాధికారులు కూపీ లాగారు. గతంలో లింగంపేట, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఆ మహిళ పలువురిని బ్లాక్‌ మెయిలింగ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో సర్పంచ్ పై చర్యలు తీసుకోకుండా కేసును పెండింగ్‌లో ఉంచి దర్యాప్తు మొదలు పెట్టారు.
    Published by:Veera Babu
    First published: