NAZIMABAD WIFE COMMITS SUICIDE BECAUSE SHE CANT STAND HUSBANDS HARASSMENT IN KAMAREDDY DISTRICT VB NZB
Crime: పాపం ఆ ఇద్దరు చిన్నారులను చూస్తే కన్నీళ్లు ఆగవు.. ఉరేసుకున్న తల్లి కాళ్లను పట్టుకొని అమ్మా.. అమ్మా.. అంటూ.. అసలేం జరిగిందంటే..
అనాథలుగా మారిన ఇద్దరు చిన్నారులు
Crime: భార్యాభర్తల మధ్య గొడవలు కాస్త ఆత్మహత్య చేసుకునే దాకా తీసుకొచ్చింది. సాఫీగా సాగిపోవాల్సిన దాంపత్య జీవితం మనస్పర్థల కారణంగా అర్థాంతరంగా ఆగి పోయింది. భర్త పెట్టే బాధలను భరించలేక ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18తెలుగు)
సంసారం ఒక చదరంగం.. చదరంగంలో భార్య భర్తలు వేసే అగుడులే పావులు.. సరైన పద్దతిలో నడుచుకుంటే అంతా భాగుంటుంది.. తప్పటడుగులు పడితే జీవితాలు నాశనం అవుతాయి. భార్య, భర్తలు ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకున్నప్పుడే ఆ సంసారం సాఫీగా సాగిపోతుంది. కాదని ఎవరి దారి వారిదే.. అన్నట్టుగా వ్యవహరిస్తే వారి జీవితం నరక ప్రాయం అవుతుంది. దీంతో ఎవరో ఒకరు జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడితే వారి పిల్లలు ఆనాథలుగా మారుతారు. తాజాగా కామారెడ్డి జిల్లాల్లో భర్త వేధింపులు భరించలేక ముడు నెలల బాలింత ఉరేసుకొని తనువు చాలించింది. దీంతో మూడు నెలల పసి పాప, మరో సంవత్సరం పాప.. ఇద్దరు ఆడ పిల్లలు ఆనాథలుగా మారారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బుడిమి గ్రామానికి చెందిన జిన్న అంజవ్వ తన కూతురు శశికలను సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మునిగే పల్లికి చెందిన నర్సింలుకు ఇచ్చి వివాహం చేశాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు.. ఒకరికి యేడాది వయస్సు, మరొకరికి మూడునేలల వయస్సు ఉంది. అయితే పెళ్లైన రోజు నుంచి భర్త నర్సింలు తాగి గొడవ పడే వాడు. ఈ రెండేళ్లల్లో పలు సార్లు పెద్దల సమక్షంలో మాట్లాడి సర్దిచెప్పి పంపించారు. అయితే అతనిలో మార్పు మాత్రం రాలేదు. శశికలకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన కళ్యాణ లక్ష్మీ డబ్బులు.. పెళ్లిలో పుట్టింటి వారు పెట్టిన బంగారం కూడా అమ్ముకుని ఖర్చు చేశాడు. నాలుగు రోజుల క్రితమే శశికల తల్లిగారి ఇంటికి వచ్చింది. ఉదయం ఇద్దరు పిల్లలకు స్నానం చేయించింది. తర్వాత తన భర్తతో పోన్ లో మాట్లాడింది. ఇంట్లో ఎవరు లేని సయంలో ప్యాన్ కు ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకుంది.
దీంతో ఇద్దరు చిన్నారులను చూసిన వారు చలించి పోయారు. మూడు నెలల ఆడ శిశువు, యేడాది వయసు ఉన్న మరో ఆడపిల్లలను ఉరి వేసుకున్న తల్లి కాళ్లు పట్టుకని అమ్మ అమ్మ అని ఎడుస్తున్న దృష్యాలను చూసినారు చలించిపోయారు. ఇలాంటి హృదయ విదారకర ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇద్దరు పిల్లలను ఎత్తుకుని మృతురాలి వృద్ధ తల్లి అంజవ్వ కన్నీటి పర్యంతం అయ్యింది. నాలుగు రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారని.. ఉదయం ఫోన్ చాలా సేపు మాట్లాడిందని.. నేను ఉపాధి హామి పనికి వెళ్లి వచ్చే సరికి నా బిడ్డ ఉరివేసుకుందని ఆమె తల్లి గుండేలు ఆవిసేల ఎడ్చింది. పెళ్లైన నాటి నుంచి భార్య భర్తల మద్య గొడవలు జరిగాయాని గ్రామ సర్పంచ్ చెప్పారు.. చాలా సార్లు పెద్దల సమక్షంలో సర్దిచెప్పి కాపురానికి పంపించామన్నారు. అయినా అతనిలో మార్పు రాలేదన్నారు. ఇద్దరు పిల్లలను చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. కుటుంబ కలహాలతో విసిగి పోయే ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెపుతున్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.