Home /News /telangana /

NAZIMABAD WIFE AND HUSBAND DIED WITH IN THREE DAYS GAP DUE TO HEALTH REASONS IN NIZAMABAD DISTRICT FULL DETAILS HERE HSN

Nizamabad: తండ్రి మరణం.. అంత్యక్రియలకు గల్ఫ్ లో ఉంటున్న కొడుకు సొంతూరికి తిరిగొచ్చిన మరు క్షణమే మరో ఘోరం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

’మీ నాన్న చనిపోయాడు. అంత్యక్రియలకు ఒక్కగానొక్క కొడుకువైన నువ్వు తప్పనిసరిగా రావాలి. వీలయినంత త్వరగా రా‘ అంటూ గల్ఫ్ లో ఉంటున్న అతడికి ఫోన్ వచ్చింది. దీంతో సొంతూరికి బయలుదేరాడు. కానీ ఇంతలోనే..

    మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి గంటల వ్యవధిలోనే మరణించిన ఉదంతాలు ఉన్నాయి. రాత్రి వరకు బాగానే ఉండి, కుటుంబంతో హ్యాపీగా భోజనం చేసి నిద్రపోయిన వ్యక్తి తెల్లారేసరికి శవమై కనిపించిన దాఖలాలు ఉన్నాయి. రోడ్డు పక్కన తనమానాన తాను నడుచుకుంటూ వెళ్తున్నా, బస్టాప్ లో నిలుచున్నా మృత్యువు ముంచుకొచ్చిన ఘటనలు మీరు చూసే ఉంటారు. చివరకు బస్సులో కిటికీ పక్కన సీట్లో కూర్చున్నా మరణం వెంటాడిన ఘటన హైదరాబాద్ లో జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. కేవలం మూడ్రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు మరణించారు. గల్ఫ్ లో ఉంటున్న కుమారుడు తిరిగి ఇంటికి వచ్చేలోపే తల్లిందండ్రులిద్దరూ మరణించడం అతడికి తీరని ఆవేదనను మిగిల్చింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన బొల్లంక శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మి భార్యాభర్తలు. శ్రీనివాస్ రెడ్డికి 72 ఏళ్ల వయసు కాగా, లక్ష్మికి 70 ఏళ్ల వయసు. వారికి రవీందర్ రెడ్డి అనే కొడుకు ఉన్నాడు. అతడు ఉపాధి నిమిత్తం గల్ఫ్ లో ఉంటున్నాడు. అనారోగ్య కారణాలతో ఏప్రిల్ 22వ తారీఖున శ్రీనివాస్ రెడ్డి మరణించాడు. ఈ విషయాన్ని గల్ఫ్ లో ఉన్న కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అంత్యక్రియల నిమిత్తం సొంతూరికి రావాల్సిందిగా కోరారు. దీంతో రవీందర్ రెడ్డి గల్ఫ్ నుంచి సొంతూరికి బయలుదేరాడు.
    ఇది కూడా చదవండి: ట్రాక్టర్ బొమ్మ ఉన్న పాత రూ.5 నోటుకు నిజంగా ఇంత డిమాండ్ ఉందా..? రూ.11 లక్షలు ఇస్తామని ఫోన్.. చివరకు..

    కానీ అతడు తన సొంతూరికి చేరుకునేలోపే మరో దుర్వార్తను వినాల్సి వచ్చింది. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో భార్య లక్ష్మి తీవ్ర మనస్తాపానికి గురయింది. కన్నీరుమున్నీరుగా విలపించింది. దీంతో ఆమె కూడా అనారోగ్యానికి గురయింది. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి ఆమెను చికిత్స నిమిత్తం చేర్పించారు. చికిత్స తీసుకుంటూనే శనివారం ఆమె మరణించింది. గల్ఫ్ నుంచి తిరిగి వచ్చేలోపే తల్లిదండ్రులిద్దరూ తనకు దూరం అవడంతో రవీందర్ రెడ్డి కన్నీటిపర్యంతమయ్యాడు. అతడి ఆవేదనను ఆపడం ఎవరితరం కాలేదు. మూడ్రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ కన్నుమూయడంతో గ్రామంలో విషాధ చాయలు అలముకున్నాయి.
    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, CYBER CRIME, Nizamabad, Telangana, Telangana crime

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు