హోమ్ /వార్తలు /telangana /

Mango prices: భారీగా ధర పలుకుతున్న మామిడి కాయలు.. క్వింటాల్​ రూ.31 వేలకు ఆమ్​చూర్​.. కారణాలివే..

Mango prices: భారీగా ధర పలుకుతున్న మామిడి కాయలు.. క్వింటాల్​ రూ.31 వేలకు ఆమ్​చూర్​.. కారణాలివే..

Amchoor mango

Amchoor mango

మామిడి కాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయ మార్కెట్​లో గ‌రిష్టంగా ఆమ్ చూర్ ధ‌ర‌ క్వింటాల్  31 వేలు పలుకుతోంది. దక్షిణ భారతంలో చింత పండును పులుపు కోసం వాడినట్లు ఉత్తర భారతంలో  ఆమ్ చూర్ ను వాడుతారు.

(P. Mahendar, news 18, Nizamabad)

మామిడి కాయల (Mangoes) ధరలు (Price) విపరీతంగా పెరిగిపోయాయి. వ్యవసాయ మార్కెట్​లో గ‌రిష్టంగా ఆమ్ చూర్ ధ‌ర‌ (Amchoor price) క్వింటాల్  31 వేలు పలుకుతోంది. దక్షిణ భారతంలో చింత పండును పులుపు కోసం వాడినట్లు ఉత్తర భారతంలో (North india) ఆమ్ చూర్ ను వాడుతారు. దీంతో ఆమ్ చూర్  ధర ఆకాశన్నంటిందని మార్కెట్ వ‌ర్గాలు చేబుతున్నాయి.   నిజామాబాద్ (Nizamabad) వ్యవసాయ మార్కెట్లో మే 11న‌  క్వింటాల్ ధర రూ.31 వేలు పలికింది. తెలంగాణలో నిజామాబాద్ మార్కెట్ లో ఆమ్ చూర్ క్రయవిక్రయాలు ఎక్కువ‌గా జరుగుతాయి. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈనామ్ వ్యవస్థ ఉండడంతో ఇక్కడి నుంచి భారతదేశానికి  ఆమ్ చూర్ ఉత్తర భార‌తానికి ఎక్కువగా ఎగుమతి అవుతుంది.

కేవలం 25 శాతం మాత్రమే..

నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆమ్ చూర్ వ్యాపారానికి ఎంతో ప్రసిద్ధి.  రాష్ట్ర నలుమూలల నుంచి మామిడి రైతులు ఇక్కడికి  ఆమ్ చూరు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడు కరువు ప్రభావం కనిపిస్తోంది. వాతావ‌ర‌ణ ప్ర‌భావంతో ఆశించినంతగా మామిడి కాత కాయలేదు. దీంతో కేవలం 25 శాతం మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు వాపోతున్నారు. ఆమ్ చూర్ తయారీ కూడా తగ్గిపోయింది.  ప్రతి ఏటా మే నెల‌ లోనే ఆమ్ చూర్ రాశులతో నిండి పోవాల్సిన నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు వెలవెల పోతోంది.  మామిడికాయగా ఉన్నప్పుడే కోసి ఇసుకలో ఎండబెడుతారు. మాయిశ్చరైజర్ లేకుండా జరిగే ఈ విక్రయాల్లో ఈసారి ధర (Mango prices) అత్యధికంగా పలకడానికి కారణమైంది.

రూ.20 వేలు దాటలేదు..

గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఆమ్ చూర్ క్రయవిక్రయాలు జరగలేవు. గతంలో చివరిసారిగా ఆమ్ చూర్ క్వింటాల్ ధర (Amchoor Quintal Price) రూ.20 వేలు దాటలేదు.  నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ నుంచి న్యూఢిల్లీ అహ్మదాబాద్, లక్నోకు ఆమ్ చూర్ ను వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. ప్రముఖ మసాలా సంస్థలు వాటిని కొనుగోలు చేసి వంటకాలలో పులుపు (Sour) కోసం వాడుతారని వ్యాపారస్తులు తెలుపుతున్నారు.


కనిష్టంగా రూ.10 వేల ధర..

నిత్యం 150 మంది వరకు రైతులు వచ్చి విక్రయిస్తున్నారు. సోమవారం 31వేల 800 గరిష్ట ధర (Mango prices)  పలికింది. మాడల్ ధరగా 27 వేల 300 ఉండగా..  కనిష్ట ధర రూ.10,200 వరకు పలికింది. సోమవారం 245 క్వింటాళ్ళ ఆమ్ చూర్ వచ్చినట్లు మార్కెట్ వ‌ర్గాలు లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు వరకు క్వింటాళ్ల కొద్ది ఆమ్ చూర్ వస్తుందని మార్కెటింగ్ అధికారులు అంచ‌నా వేస్తున్నారు.  నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ లో ఐదారుగురు కమిషన్ ఏజెంట్లు మాత్రమే వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఈ నామ్​లే సైతం ముగ్గురు వ్యాపారులే ఉండటంతో తేమ శాతం లేని ఆమ్ చూర్  గరిష్టంగా రూ.31 వేలు వస్తుండగా కనిష్టంగా రూ.10 వేల ధర వస్తుందని అధికారులు చెబుతున్నారు. పంట దిగుబ‌డిని దృష్టిలో పెట్టుకుని ఆమ్ చూర్ ధ‌ర‌లు ప‌డి పొకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. అయితే ఈ నామ్ లో ఇతర రాష్ట్రాల వ్యాపారులు సభ్యులుగా చేర్చితే  మ‌రింత ధ‌ర పెగుతుంద‌ని భావిస్తున్నారు..

First published:

Tags: Mango, Nizamabad

ఉత్తమ కథలు