Festival Celebrations: భక్తి శ్రద్ధలతో ఊర పండుగ.. కొలువుదీరిన గ్రామదేవతలు.. ప్రత్యేకతలివే..

గ్రామదేవతలకు పూజలు చేస్తున్న దృశ్యం

Festival Celebrations: హైదరాబాద్ మహంకాళి బోనాలకు ఎంత ప్రత్యేక ఉందో.. నిజామాబాద్ ఊర పండగకు అంతే ప్రత్యేకత ఉంది.నిజామాబాద్ నగరంలో ఊరపండగ ఘనంగా జరిగింది. సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో గ్రామ దేవతల విప్రతిమాలను వేపాకట్టే పై చెక్కి ప్రత్యేక పూజలు చేశారు.

 • Share this:
  (పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

  హైదరాబాద్ మహంకాళి బోనాలకు ఎంత ప్రత్యేక ఉందో.. నిజామాబాద్ ఊర పండగకు అంతే ప్రత్యేకత ఉంది.నిజామాబాద్ నగరంలో ఊరపండగ ఘనంగా జరిగింది. సర్వసమాజ్‌ ఆధ్వర్యంలో గ్రామ దేవతల విప్రతిమాలను వేపాకట్టే పై చెక్కి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పాల్గొని గ్రామదేవతలకు పూజలు చేశారు. అనంతరం గ్రామదేవతలను ఊరేగించారు. నిజామాబాద్ ఊరపండుగకు హైదరాబాద్ మహంకాళి బోనాలకు ఉన్నంత ప్రత్యకత ఉంది. గతంలో నిజామాబాద్‌లో ప్లేగు, అతిసార వంటి వ్యాధుల ప్రభావంతో చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. దీంతో ప్రజలు ఇలాంటి వ్యాధుల నుంచి తమను, పశువులను రక్షించుకునేందుకు గ్రామ దేవతకు మొక్కుకొని మొక్కులు తీర్చుకునే పండగే ఊర పండుగ. ఊర పండుగను ఊరంతా కలిసి పెద్దఎత్తున నిర్వహించడం 1935వ సంవత్సరం నుంచి ప్రారంభమైంది.

  గ్రామ దేవతలకు పూజలు వంశ పారంపర్య పూజారుల పర్యవేక్షణలో పెద్ద మ్మ, ఐదుచేతుల పోశవ్వ, మత్తడి పోశవ్వ, మహాలక్ష్మవ్వ వంటి 13 గామ్ర దేవతలకు నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం సమీపంలో తేలు మైసమ్మ గద్దె వద్ద పూజలు జరిపి డప్పులు, పోతరాజుల విన్యాసాలతో ఊరేగించడం ఆనవాయితీ గా వస్తుంది.. గ్రామ దేవతలని ప్రతిబింబాలుగా తొట్టెలను కూడా ఊరేగిస్తారు. తొట్టెలకింద నుంచి వెళ్తే అమ్మవార్ల దయ తమపై ఉంటుందని ప్రజలు విశ్వసిస్తారు. ఊర పండుగలో సిరికి ప్రత్యేక స్థానం ఊర పండుగలో సిరి గుల్ల అనే విశేష పదార్థానికి ప్రత్యేక స్థానం ఉంది.

  సిరిగుల్లలో బియ్యం, జొన్న పిండిలో పసుపు, కుంకుమ, వేపాకు, కలిపి కదంబంగా వండుతారు. గొర్రెను గావ పట్టిన రక్తంను సిరికి కలుపుతారు. రెండు గుల్లల్లో కలిపి ఒక గుల్లను పెద్దబజార్‌ మీదుగా దుబ్బవైపు, మరో గుల్లను కోటగల్లి నుంచి వినాయక్‌నగర్‌వరకు తరలించి అంతటా చల్లుతారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ... ప్రజల ఆయురారోగ్యాలు బాగుండాలని.. పాడిపంటలు మంచిగా పండాలని ఈ ఊర పండగ చేస్తారని అయన అన్నారు.
  Published by:Veera Babu
  First published: