Home /News /telangana /

NAZIMABAD TWO YOUNG MEN WHO WENT TO A WEDDING IN NIZAMABAD DISTRICT FELL INTO A DITCH AND DIED SNR NZB

Nizamabad:పెళ్లికి వెళ్లిన ఆ ఇద్దరూ ప్రాణాలతో రాలేదు..అక్కడికి వెళ్లడం వల్లే

(పెళ్లికి వెళ్లి..ప్రాణాలతో రాలేదు)

(పెళ్లికి వెళ్లి..ప్రాణాలతో రాలేదు)

Nizamabad:నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు స్నేహితులు వివాహ వేడుకలకు వెళ్లి మృత్యువాతపడ్డారు. చెరువులో కాళ్ల కృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి నీళ్లలో మునిగిపోయారు. జాలర్లు సాయంతో నీళ్లలో నుంచి శవాలను బయటకు తీశారు. మృతదేహాల్ని చూసి కుటుంబ సభ్యులు బోరునవిలపించారు.

ఇంకా చదవండి ...
    (P.Mahendar,News18,Nizamabad)
    వాళ్లు వివాహ వేడుకకు వెళ్లారు. వెళ్లి వ్యక్తులు తిరిగి రాలేదు. పెళ్లికి వెళ్లిన వాళ్లు వేడుకల విశేషాలను మోసుకొస్తారని ఇద్దరు స్నేహితుల కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తున్న ఇద్దరు యువకులు విగతజీవులుగా మారడం వాళ్ల మృతదేహాలను ఆసుపత్రిలో చూడటంతో  బోరున విలపించారు. చెట్టంత ఎదిగిన బిడ్డలు విగతజీవుల్లా..శాశ్వతంగా తమకు దూరమయ్యారన్న వార్తను ఆ రెండు కుటుంబాల సభ్యులు తట్టుకోలేకపోయారు. వివాహ వేడుక కాస్త రెండు కుటుంబాల్లో  విషాదం నింపిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ (Nizamabad)జిల్లా రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో బందువుల‌ పెళ్లికి వెళ్లారు కల్దుర్కి గ్రామానికి చెందిన  శ్రీకాంత్(Srikanth), బోధన్ మండలంలోని ఖండ్గావ్ గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ (శ్రావణ్(Shravan) పెళ్లికి వెళ్లారు. వివాహం ముగియగానే కూనేపల్లి(Koonepalli)కి దగ్గరలో ఉన్న బాగేపల్లి(Bagepally)లో శ్రీకాంత్ చెల్లెలు ఉంటోంది. అక్కడికి వెళ్లి ఆమెను కలిసి వద్దామని శ్రావణ్‌ని వెంటబెట్టుకొని వెళ్లాడు శ్రీకాంత్. బాగేపల్లిలో ఉన్న సోదరితో క్షేమ, సమాచారాలు తెలుసుకున్నారు. అటుపై కాళ్లకృత్యాలు తీర్చుకునేందుకు ఉదయం తొమ్మిది గంటల సమయంలో  ఊరి చివర్లో ఉన్న అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం కాలువ దగ్గర వెళ్లారు. అక్కడ శ్రీకాంత్‌ కాలు జారి నీళ్లలో పడిపోయాడు. అతడ్ని కాపాడాలనే ఆలోచనతో శ్రావణ్‌ కూడా నీళ్లలో దూకాడు.

    వేడుకలకు వెళ్లి..
    ఇద్దరు స్నేహితులు నీళ్లలో దూకిన కాసేపటికే మునిగిపోయారు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం చేరవేశారు. వెంటనే స్పందించిన పోలీసులు జాలర్ల సాయంతో కాలువలో దిగి  శ్రీకాంత్, శ్రావణ్ కోసం గాలించారు. అయితే ఇద్దరూ నీళ్లలో మునిగి చనిపోవడంతో మృతదేహాలను బయటకు తీశారు జాలర్లు. ఇద్దరూ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. మృతదేహాలను శవపరీకల నిమిత్తం బోధన్‌ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాంత్‌ మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు కల్దుర్కి గ్రామం నుంచి పరుగున వచ్చారు. అటు శ్రావణ్‌ తల్లిదండ్రులు ఖండ్గావ్ గ్రామం నుంచి బోధన్ ఆసుపత్రికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను చూసి బోరున విలపించారు.

    (పెళ్లికి వెళ్లి శవాలయ్యారు)


    వివాహం పేరుతో విషాదం..
    వివాహ వేడుకల కోసం వచ్చిన ఇద్దరు స్నేహితులు ప్రాణాలు పోగొట్టుకోవడం అందర్ని కలచివేసింది. చేతికొచ్చిన కొడుకులు కాటికి పంపాల్సిన పరిస్థితి రావడంపై ఇద్దరు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బిడ్డల్ని దూరం చేసుకున్న శ్రీకాంత్, శ్రావణ్ తల్లిదండ్రుల్ని ఓదార్చలేకపోయారు బంధువులు, గ్రామస్తులు.
    Published by:Siva Nanduri
    First published:

    Tags: Nizamabad, Two died

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు