హోమ్ /వార్తలు /telangana /

Telangana Politics: అసెంబ్లీ పోటీకి సిద్ధంగా ఇద్దరు యువ నాయకులు.. వారికోసం సైడ్​ అయిపోతున్న సీనియర్​ ఎమ్మెల్యేలు

Telangana Politics: అసెంబ్లీ పోటీకి సిద్ధంగా ఇద్దరు యువ నాయకులు.. వారికోసం సైడ్​ అయిపోతున్న సీనియర్​ ఎమ్మెల్యేలు

బాజిరెడ్డి, పోచారం (ఫైల్​ ఫొటోలు)

బాజిరెడ్డి, పోచారం (ఫైల్​ ఫొటోలు)

వారిరువురు రాజ‌కీయాల్లో ద‌శ‌బ్దాలు ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా తమ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి త‌ప్పుకుని వారి వార‌సుల‌ను అసెంబ్లీకి పంపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

  (న్యూస్ 18 తెలుగు ప్రతినిధి : పి మహేందర్)

  రాజ‌కీయాల్లో (Telangana Politics) ఓ స్థాయికి ఎదిగిన నాయ‌కుని పిల్ల‌లు వారస‌త్వంగా రాజకీయాల్లోకి రావడం స‌ర్వ‌ సాధారణం. ఇదే కోవలో ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అనేక మంది నేతలు తమ వార‌సులను రాజకీయాలకు పరిచయం చేశారు.  కొందరు తండ్రిని మించిన త‌న‌యులుగా గుర్తిపు తెచ్చుకుంటే .. మ‌రికొంద‌రు కనుమరుగైపోయారు. అయితే తాజాగా ఇద్ద‌రు యువ నాయ‌కులు (two young leaders) వార‌స‌త్వంగా రాబోయే ఎన్నికల నాటికి  (contest the upcoming assembly elections) సిద్ధమవు తున్నారు.  యువ నాయ‌కుల‌కు కుటుంబం నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. వారిరువురి తండ్రులు రాజ‌కీయాల్లో ద‌శ‌బ్దాలు ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా తమ కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు. అయితే క్రియాశీల రాజకీయాల నుంచి త‌ప్పుకుని వారి వార‌సుల‌ను అసెంబ్లీకి పంపేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.

  మాస్ లీడ‌ర్లు గా గుర్తింపు ..

  నిజామాబాద్ ఉమ్మ‌డి జిల్లాలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఆర్టీసీ చైర్మ‌న్,  బాజీ రెడ్డి గోవ‌ర్ద‌న్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా  పేరున్ననేతలు.. వారిద్ద‌రు మాస్ లీడ‌ర్లు గా గుర్తింపు  తెచ్చుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి  (Pocharam srinivas reddy)సుమారు 40 యేళ్లుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో త‌నకంటు ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ప‌లుదఫాలుగా మంత్రి పదవులు నిర్వహించి ఆ పదవులకు వన్నె తెచ్చిన నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీతో రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన పోచారం తెలంగాలు రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ (TRS) లో చేరారు. రాష్ట్ర ఏర్పాటుతో వ్యవసాయశాఖ మంత్రిగా రాణించి, తరువాత స్పీకర్ గా సభను నడుపుతున్నారు. అయితే 73 సంవత్సరాల వయసులో కూడా ప్రజాసేవలో ఉన్న పోచారంకు ఆరోగ్యం సహకరించడం లేదు. దీంతో తనయుడు భాస్కర్ రెడ్డి (Bhaskar Reddy)ని అసెంబ్లీకి పంపేందుకు (contest the upcoming assembly elections)  రంగం సిద్ధం చేశారు. వచ్చే ఎన్నికల్లో  తండ్రి స్థానంలో తనయుడు బరిలో దిగనున్నారు.

  డీసీసీబీ చైర్మన్ గా..

  భాస్కర్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్నారు.  భాస్కర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో కామారెడ్డి జిల్లాలో క్రియాశీల నేతగా ఉన్నారు. తండ్రిలాగే తన రాజకీయ ప్రస్తానాన్ని డీసీసీబీ చైర్మన్ గా మొదలు పెట్టారు.  పోచారం శ్రీనివాస్ రెడ్డికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రవీందర్ రెడ్డి  వైద్యుడిగా స్థిరపడ్డారు.. రెండో కుమారుడు సురేందర్ రెడ్డి వ్యాపారంలో స్థిరపడి తండ్రి పోచారంకు రాజకీయాల్లో చేదోడువాదోడుగా ఉంటున్నారు. చిన్న కుమారుడు భాస్కర్ రెడ్డి పూర్తిగా రాజకీయాల్లోనే తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.

  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా..

  నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన నేత బాజిరెడ్డి గోవర్ధన్ (Baji reddy Goverdhan). మాస్ లీడర్ బాజిరెడ్డి జనాల్లో, కార్యకర్తల్లో భరోసా నింపడంలో ముందుంటారు. అందుకే జిల్లాలో ఎక్కడనుంచి పోటీ చేసినా గెలుపు ఖాయం అనే నేత‌ బాజిరెడ్డి గోవర్ధన్.  నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది. ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. వయసు రీత్యా 66 సంవత్సరాలు దాటిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇకపై తన వారసుడు బాజిరెడ్డి జగన్ (Jagan)ను రాబోయే ఎన్నికల నాటికి సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి (upcoming assembly elections) గోవర్ధన్ వయస్సు 68 సంవత్సరాలకు చేరనుంది.  దీంతో త‌న వార‌సుడుగా జగన్ ను రంగంలోకి దింపేందుకు  సిద్ధం చేస్తున్నారు.. అవగాహన కోసం అనేక ఏళ్లుగా తండ్రి వెంట జగన్ ప్రజా క్షేత్రంలో విస్తృతంగాపర్యటిస్తున్నారు. తండ్రికి వెన్నంటి ఉంటూ ధ‌ర్ప‌ల్లి జడ్పీటీసీగా కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నాయకుడిగా తన పాత్రను నిర్వర్తిస్తున్నారు.

  బాజిరెడ్డి గోవర్ధన్ కు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడు జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. చిన్నకుమారుడు అజయ్ వ్యాపార రంగంలో స్థిరపడి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో బాజిరెడ్డి గోవర్ధన్ జగన్ ను తన రాజకీయ వారసుడిగా వచ్చే  అసెంబ్లీ ఎన్నికల్లో బ‌రిలో దింప‌నున్నారని స‌మాచారం.    రాబోయే శాసనసభ ఎన్నికల నాటికి పోచారం, బాజిరెడ్డిల వారసులు భాస్కర్ రెడ్డి, జగన్ లు బరిలో ఉండబోతున్నారు.

  అయితే మరి కొంత మంది ఎమ్మెల్యేల కుమారులు తండ్రులకు రాజకీయాల్లో వెన్నంటి ఉంటూ చేదోడువాదోడుగా ఉంటున్నారు. భవిష్యత్తు రాజకీయాల్లో వారసులుగా ఇప్పటి మంచే ప్రజల్లో బీజం వేసుకుంటున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే, విప్ గంపగోవర్దన్ తనయుడు శశాంక్ తండ్రితో పాటు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు. విదేశాల్లో చదువును పూర్తి చేసుకుని వచ్చిన శశాంక్ భవిష్యత్తు రాజకీయాలకు వారసుడిగా సిద్ధమవుతున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కుమారుడు హరీశ్ షిండే కూడా తండ్రి బాటలో నడిచేందుకు ఇప్పటి నుంచే రాజకీయాల్లో తన పాత్రను పోషిస్తున్నారు. అయితే తండ్రుల స్థాయిలో తనయులు  రాజకీయాల్లో ఎంతమేర రాణిస్తారో చూద్దాం..

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Kamareddy, Telangana Politics, TRS leaders, Ts assembly sessions

  ఉత్తమ కథలు