హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Crime: గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు.. ఒక్కరోజే 12 మంది మృతి.. అతివేగమే కారణమా..?

Telangana Crime: గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు.. ఒక్కరోజే 12 మంది మృతి.. అతివేగమే కారణమా..?

రోడ్డు ప్రమాద దృశ్యం

రోడ్డు ప్రమాద దృశ్యం

Telangana Crime: ఈ  ప్ర‌మాదం రెండు కుటుంబాల్లో చీక‌టిని నింపింది.. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన క్వాలిష్ వాహ‌నం ఢీ కొట్టగా.. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డికి అక్క‌డే మృతి చెంద‌గా... మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

ఇంకా చదవండి ...

(P.Mahender,News18,Nizamabad)

ఈ  ప్ర‌మాదం రెండు కుటుంబాల్లో చీక‌టిని నింపింది.. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన క్వాలిష్ వాహ‌నం ఢీ కొట్టగా.. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు అక్క‌డికి అక్క‌డే మృతి చెంద‌గా... మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. చికిత్స పొందుతూ మ‌రో ముగ్గురు మృతి చెందారు. మృతులు హైద‌రబాద్ కు చెందిన వారుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.. కామారెడ్డి జిల్లా పెద్ద‌కొడ‌ప‌గ‌ల్ మండ‌లం జ‌గ‌న్నాథ్‌ప‌ల్లి గేటు వ‌ద్ద శ‌నివారం మ‌ధ్యాహ్నం ఘోర రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. వేగంగా వ‌చ్చిన కారు అదుపుత‌ప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్ర‌యాణిస్తున్న 6 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా..  మ‌రో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు ..  విష‌యం తెలిసిన పోలీసులు  సంఘ‌ట‌న స్థాలానిక చెరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమితం త‌ర‌లించారు.

School Studendt: స్కూల్లో బర్త్ డే పార్టీ చేసుకున్నాడు ఆ విద్యార్థి.. యాజమాన్యం వేధింపులతో.. చివరకు ఇలా చేశాడు..


గాయ‌ప‌డిన వారిని  చికిత్స నిమిత్తం బాన్సువాడ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.  మృతుల్లో ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. గాయ‌ప‌డ్డ వారి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. చికిత్స పొందుతు మ‌రో ముగ్గురు మృతి చెందిన‌ట్లు సమాచారం. హైద‌ర‌బాద్ లోని చాద‌ర్ ఘాట్ కు చెందిన ఆమీర్ తాజ్ కుటుంబంతో పాటు వారి బంధువుల కుటుంబ‌ స‌భ్యులు క‌లిసి రెండు రోజుల క్రితం నాందేడ్ లోని దర్గాకు వెళ్ళారు. ధ‌ర్గాలో  దైవ ధ‌ర్శం చేసుకున్న త‌రువాత హైద‌ర‌బాద్ కు తిరుగు ప్ర‌యాణం అయ్యారు. క్వాలీస్ వాహ‌హనంలో 12 మంది ప్రయాణిస్తున్నారు. కామారెడ్డి జిల్లా పెద్ద‌కొడ‌ప‌గ‌ల్ మండ‌లం జ‌గ‌న్నాథ్‌ప‌ల్లి గేటు 161 జాతీయ రహాదారి పై  ఆగి ఉన్న లారీని వేగంగా వ‌చ్చిన‌ క్వాలీస్ వాహ‌నం వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆరుగురు అక్క‌డికి అక్క‌డే మృతి చెందారు.. మ‌రో ఆరుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.

Road Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు సహా ముగ్గురు దుర్మరణం..

మృతుల్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు, ఇద్ద‌రు చిన్నారులు.. డ్రైవ‌ర్ తో పాటు అమీర్ మృతి చెందాడు. చికిత్స పొందుతున్న మ‌రో ఆరుగురిలో ముగ్గురు ప‌రిస్థితి విష‌మించింది.. దీంతో వారు కూడా మృతి చెందిన‌ట్లు తెలుస్తోంది. చాద‌ర్ ఘాట్ కు చెందిన మృతుల కుటుంబాల‌కు విష‌యం చెప్పాము.. వారు రాగానే వారి ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసుకుని దర్యాప్తు చేస్తామ‌ని డీఎస్పీ తెలిపారు. ఈ ప్ర‌మాదానికి అతి వేగమే కార‌ణం అని అంటున్నారు. మృతులంతా రెండు కుటుంబాలు చెందిన వారుగా గుర్తించారు.. దీంతో ఆ కుటుంబాల్లో విష‌ద‌ఛాయ‌లు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు.

Road Accident: కామారెడ్డిలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్.. మరో తొమ్మిది మంది పరిస్థితి..


గచ్చిబౌలి లో హెచ్ సి యు రోడ్ లో వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దారుణమైన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు కాగా… మరొకరు బ్యాంకు ఉద్యోగి అబ్దుల్ ఉన్నారు. ఒక్కరోజే తెలంగాణలో 12 మంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వీటిపై పోలీసులు మాట్లాడుతూ.. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ నడపాలని.. వాహనాల వేగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అతి వేగం కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని.. దీని వల్ల వీళ్లపై ఆధారపడిన వాళ్లు రోడ్డున పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

First published:

Tags: Crime, Crime news, Road accident

ఉత్తమ కథలు