TS RTC : ఆర్టీసిని ఎట్టి పరిస్థితుల్లో మూసివేయం... చైర్మన్ బాజిరెడ్డి

Bajireddy Govardan

TS RTC : న‌ష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట ప‌ట్టించేందుకే సీఎం కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. ఈ నేఫథ్యంలోనే ఆర్టీసిని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అందుకే తనను చైర్మణ్ గా నియమించారని అన్నారు.

  • Share this:
    నాలుగు నెలల్లో ఆర్టీసీ గాడిన పడకపోతే మూసివేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పిన ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ ( Bajireddy govardan )మరోసారి స్పందించారు. అయితే ఎట్టిపరిస్థితుల్లో ఆర్టీసి మూసివేసే పరిస్థితి లేదని అయన చెప్పారు. ఆర్టీసి గాడిన పెట్టెందుకే తనకు చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు సైతం ఆర్టీసి అభివృద్దికి,సలహాలు సూచనలు చేయాలని ఆయన చెప్పారు.

    ఇక ఆర్టీసి గాడిన పెట్టె చాలా కష్టమైన టాస్క్ ను ముఖ్యమంత్రి కేసీఆర్(cm kcr) నాపై ఉంచారని అన్నారు.. ఆ టాస్క్ ను స‌వాలుగా తీసుకుని నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టే విధంగా పని చేస్తామ‌న్నారు.. కరోనా కు ముందు ఆర్టీసీకి 14 కోట్లు దినసరి ఆదాయం వ‌చ్చేది.. కానీ క‌రోనా తర్వాత ఆదాయం మూడు కోట్లకు పడిపోయిందని చెప్పారు.... దీంతో ఆర్టీసీ కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు.. మరో పక్క కేంద్రం డీజిల్ ధరలు పెంచి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఆర్టిసి పరిస్థితి ఉందన్నారు..

    రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో తొమ్మిది వేల పై చికులు బస్సులు ఉన్నాయి.. అందులో ఆరు వేల బస్సులు ప్రభుత్వానివి.. మూడు వేల పైచిలుకు బస్సులు ప్రైవేటు బస్సులు ఉన్నాయి.. అయినా నష్టాలు ఎలా వస్తున్నాయనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్న‌మ‌న్నారు..

    ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో అమ్మేది లేదని.. సీఎం కేసీఆర్ బలం గా చెప్పారు.. కచ్చితంగా ఆర్టీసీని లాభాల బాట పట్టించే విధంగా మా పనితీరు ఉంటుందని బాజీరెడ్డి అన్నారు.. ప్రతిపక్షాలు విమర్శించే బదులు ఆర్టీసీ నష్టాన్ని పూడ్చే సలహాలు ఇవ్వాలని కోరారు.. ఏదో విమర్శిస్తున్నాం కదా అని విమర్శించి వదిలేయడంతో లాభం లేదని ప్రతిపక్షాలు వారి కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అన్నారు.. రాష్ట్రంలో ఆర్టీసీ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటిని గుర్తించి వాటిలో షాపింగ్ కాంప్లెక్స్ లో పెట్రోల్ బంకు లాంటి ఏర్పాటు చేసి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేవిదంగా చ‌ర్య‌లు తీసుకుంటాము.. ఆర్టీసీని లాభాల బాట పట్టించే వ‌ర‌కు ఆలుపేరుగ‌క ప‌ని చేస్తామ‌న్నారు.. ఆర్టీసీ స్థలాలు ఎవరైనా కబ్జా చేస్తే అలాంటివి ఏమి ఉన్నా.. తిరిగి తీసుకుంటామన్నారు.

    ఆర్టీసి చైర్మన్ గా భాద్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత మొద‌టి సారిగా స్వంత జిల్లాకు చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఆనంతరం ఆర్టీసి పరిణామాలపై ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాలుగు నెలల్లోగా ఆర్టీసీ గాడిన పడక పోతే.. ప్రైవేటు పరం చేయడానికి సీఎం సిద్దంగా ఉన్నారనే సంకేతాలు ఇచ్చారు. దీంతో కార్మికులు కష్టపడి పని చేయాలని ఆయన సూచించారు. లేదంటే ఆర్టీసిని ఎవ్వరు కాపాడలేరని చెప్పారు. దీంతో కార్మికుల్లో ఆందోళన మొదలైంది.
    Published by:yveerash yveerash
    First published: