Jeevan reddy: బీజేపీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రధాని మోదీ, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రధాని తెలంగాణ ఏర్పాటు అంశంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆర్మూర్‌లో కేంద్ర ప్రభుత్వానికి శవయాత్ర నిర్వహించారు. బీజేపీది గాంధీని చంపిన గాడ్సే ఇజమని కేసీఆర్‌కి అంబేద్కర్ ఇజం అంటూ ఫైర్ అయ్యారు.
పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ టీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. బీజేపీ, ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ నిజామాబాద్ (Nizamabad)జిల్లా ఆర్మూర్(Armoor)లో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి (Jeevan Reddy)ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, కేంద్ర ప్రభుత్వానికి శవయాత్ర నిర్వహించారు. బీజేపీ వ్యవహార తీరుపై తీవ్రంగా మండిపడ్డ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి. గాంధీని చంపిన గాడ్సే ఇజం (Godsy) బీజేపీదంటూ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్‌ది అంబేద్కర్ (Ambedkar)ఇజం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన పసుపు బోర్డు హామీ ఏమైందని ప్రశ్నించారు జీవన్‌రెడ్డి. బీజేపీ ఓ అబద్దాలు చెప్పే పార్టీ అయని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ పాలన రోల్‌మోడల్‌గా వర్ణించిన నోటితోనే విషం కక్కుతావా అంటూ ఏకవచనంతో సంభోదించారు జీవన్‌రెడ్డి. కేసీఆర్‌తో పెట్టుకున్న బీజేపీకి మూడిందన్నారు. భవిష్యత్తులో ఏం చేస్తామో చూపిస్తామన్నారు. బీజేపీ తీరుని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో మొదట బైక్ ర్యాలీలో పాల్గొన్నారు జీవన్‌రెడ్డి. పట్టణంలోని వీధుల్లో బుల్లెట్ నడిపారు. అటుపై కేంద్ర ప్రభుత్వానికి శవయాత్ర నిర్వహించిన అనంతరం స్వర్గయాత్ర రథంలో ఊరేగించారు.
గులాబీ వర్సెస్ కమలం..
టీఆర్ఎస్ నిరసన కార్యక్రమాల్లో జీవన్‌రెడ్డి బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాలీవుడ్, టాలీవుడ్లో చాలా మంది హీరోలున్నారని కానీ తెలంగాణకు కేసీఆర్ ఒక్కడే దమ్మున్న హీరో అంటూ కొనియాడారు. కేసీఆర్‌తో పెట్టుకున్నోడు ఎవరూ మిగల్లేదని బీజేపీ కూడా మిగలదన్నారు. రాజ్యసభలో చిన్నమ్మను, పెద్దమ్మను, జాతీయ, ప్రాంతీయ పార్టీలను ఓప్పించి తెలంగాణ తీసుకు వచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. కేసీఆర్ అంటే ఓ నమ్మకం అని కామెంట్ చేసిన జీవన్‌రెడ్డి బీజేపీ అంటే నమ్మకం అంటూ నోరు జారారు. అబద్దపు హామీలు, బక్వాస్ మాటలతో ఒక్క వ్యక్తి నిజామాబాద్‌కి ఎంపీ అయ్యాడంటూ ధర్మపురి అరవింద్‌ని ఉద్దేశించి విమర్శించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 95శాతం మంది రైతులు ఉన్నారని ఆ విషయాన్ని మర్చిపోయి రాద్ధాంతం చేస్తే మీ సంగతి తేలుస్తామంటూ హెచ్చరించారు.
బీజేపీది గాడ్సే ఇజమన్న జీవన్‌రెడ్డి..
గత ఎన్నికల్లో నిజామాబాద్‌కు పసుపు బోర్డు తెస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ అరవింద్‌ని పసుపు బోర్డు తెచ్చే వరకు వదలమని వార్నింగ్ ఇచ్చారు. ఆర్మూర్ నియోజకవర్గంలో 95 శాతం రైతులే ఉన్నారని గుర్తు చేశారు. అరవింద్‌ని అడ్డుకుంది అడ్డుకున్నది రైతులు కాదని చెప్పడం సిగ్గు చేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. గులాబీ శ్రేణులు బీజేపీ వ్యాఖ్యలను ఖండిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో జీవన్‌రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ దాదాన్న గారి విట్టల్ పాల్గోన్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.