హోమ్ /వార్తలు /తెలంగాణ /

Love Marriage: నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే ఇలా..

Love Marriage: నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.. నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే ఇలా..

రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం దృశ్యం

రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం దృశ్యం

Love Marriage: వారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం జరిగి నాలుగు నెలలు గడవకముందే ఆమెకు అత్తింటి వేధింపులు ఎక్కువ అయ్యాయి. మహిళా సంఘాల సభ్యులతో కలిసి అత్తింటి వారి ఎదుట తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

ఇంకా చదవండి ...

  (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  ప్రేమించే స‌మ‌యంలో అంతా అద్భుతంగా క‌నిపిస్తుంది. ఏ విష‌యం గుర్తుకు రాదు. ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోరు. వారి లోకం వారిది. ఇదే స్వ‌ర్గం అనుకుంటారు. నీకు నేను నాకు నీవు అన్నట్టుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఇక మూడు ముళ్లతో పెళ్లి అనే బంధం ఏర్ప‌డ‌గానే ప్రేమించిన‌ప్ప‌టిలా అనిపించదు. అప్పుడే బాగుండే అనే భావ‌న‌లోకి వెళ్తారు. అయితే ఇలాంటి ఘ‌ట‌నే నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. నాలుగు సంవ‌త్స‌రాలు ప్రేమించుకున్నారు. పెద్ద‌ల‌ను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై నాలుగు నెల‌లు గ‌డ‌వ‌క ముందే భర్త కోసం భార్య న్యాయం పోరాటం చేస్తుంది. పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కుంభాల రమ్యకృష్ణ, ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన లింగు మణిరత్నం అనే అబ్బాయి గత నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 12న‌ జాన్కంపేట్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో వివాహం చేసుకున్నారు. బుద్ధిష్ట్ అంబేద్కర్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఏప్రిల్ లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నారు.. అంతా బాగుంది.. అనే లోపే అత్తింటి వారి వేధింపులు తాళలేక భర్త తనను వేధిస్తున్నాడని బాధితురాలు వాపోయింది.

  త‌న భ‌ర్త‌కు అత్తామామలు నన్ను వ‌దిలేయ‌ల‌ని ఒత్తిడి తెస్తున్నార‌ని.. మ‌రో అమ్మ‌యితో పెళ్లి చేస్తామంటున్నార‌ని తన భ‌ర్త ఆమెతో చెప్పాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. బాధితురాలికి మహిళా సంఘం మ‌హిళలు బాసటగా నిలిచారు. బాధితురాలికి న్యాయం చేయాల‌ని భర్త ఇంటి ఎదుట ధ‌ర్నా చేశారు. తన భర్త త‌ల్లి దండ్రుల మాట విని నాకు దూర‌మ‌వుతున్నాడ‌ని బాధితురాలు ఆవేద‌న వ్య‌క్తం చేసింది.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 3టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్థానిక ఎస్ఐ సంతోష్ కుమార్ పట్టించుకోలేదు. ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లో న్యాయం చేస్తారని ఆశతో ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన స్థానిక ఎస్ఐ శ్రీకాంత్ కూడా తన ఫిర్యాదు స్వీకరించకరించ‌క‌పోగా త‌ను నీ ఇష్టం వ‌చ్చిన చోట చెప్పుకో అన్నాడని బాధితురాలు వాపోయింది. మహిళా సంఘాల సభ్యులతో కలిసి అత్తింటి వారి ఎదుట తనకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగింది.

  తన భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన దృశ్యం

  తనకు బాసటగా నిలిచిన మహిళా సంఘాల సభ్యుల పట్ల తన అత్తింటి వారు అసభ్యకర పదజాలంతో దూషించారని, దాడి చేయడానికి వచ్చారని వాపోయింది. తనకు న్యాయం జరగకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలికి కాకుండా ఆమె భ‌ర్త‌ కుటుంబానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని, మహిళా సంఘం నాయకురాలు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఒక మహిళకు న్యాయం చేయాల్సిన పోలీసు సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  Published by:Veera Babu
  First published:

  Tags: Love cheating, Nizamabad

  ఉత్తమ కథలు