Lovers: ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకోవాలనుకున్నారు.. ధైర్యంగా ఇంట్లో ప్రేమ విషయం చెప్పారు.. కానీ చివరకు ఏమైందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Lovers: ఇద్ద‌రు ప్రేమించు కున్నారు.. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు.. కుటుంబ‌స‌భ్యుల‌కు విష‌యం చెప్పారు.. కుటుంబ‌ పెద్ద‌లు పెళ్లికి అంగీకరించలేదు.. పెద్ద‌ల‌ను ఎదిరించలేక‌ ఆత్మ‌హ‌త్యాయత్నం చేశారు. ఒక‌రు మృతి చెంద‌గా మారొక‌రి పరిస్థితి విషమంగా ఉంది.

  • Share this:
    (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

    రెండక్షరాల ప్రేమ.. ఎప్పుడు పుడుతుందో.. ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు. ఆ ప్రేమ కోసం ప్రేమికులు ఏమైనా చేస్తారు. ఇదంతా సినిమాలోనే ఉంటుంది అనుకుంటాం.. కానీ నిజజీవితంలో కూడా ఇలాంటివి జరగుతున్నాయి. ప్రేమించుకున్న వారి జంట ఇంట్లో ధైర్యంగా చెప్పారు. పెళ్లి చేసకుంటామని చెప్పినా వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఆ ప్రేమికులు చేసేది లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పురుగు మందు తాగారు. అందులో యువతి చనిపోగా యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

    కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నీర‌డి రాజు(23).. ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకున్నాడు. రెండేళ్లుగా దూబాయి వెళ్లి క‌రోనా పస్ట్ వేవ్ లో స్వదేశానికి తిరిగి వ‌చ్చాడు. అదే గ్రామానికి చెందిన‌ భ్యాగ‌రి మాధవి (17) ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దువుకుంది. త‌రువాత పై చ‌దువులు చ‌దువ‌కుండా ఇంటి వ‌ద్దే ఉంటుంది. అయితే గ‌త ఏడాది క్రితం గ‌ల్ఫ్ దేశం నుంచి వ‌చ్చిన రాజు, మాధ‌వి ఇద్ద‌రు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాల‌నుకున్నారు. కుటుంబ పెద్ద‌ల‌కు ఈ విష‌యం చెప్పారు. అయితే ఇరు కుటుంబాల‌ ఇంటి పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోలేదు. దీంతో విడిపోయి బతకలేక చావులో నైన క‌లిసి చావాల‌నుకున్నారు.

    గతనెల 30న గ్రామ శివారు లోని పంట చేనుకు వెళ్లి క్రిమిసంహార‌క మందు తాగారు. ఆప‌స్మ‌ర‌క స్థితిలో ఉన్న వీరిని చూసిన స్థానికులు కుటుంబ‌స‌భ్యుల‌కు విష‌యం చెప్పారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ప్రేమ‌జంట‌కు మెరుగైన వైద్యం కొసం హైదరాబాద్ కు త‌ర‌లించారు.. ఉస్మానియా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మాధవి మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉంది. అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసున‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
    Published by:Veera Babu
    First published: