Home /News /telangana /

NAZIMABAD THERE ARE ALLEGATIONS THAT TEMPORARY JOBS ARE BEING FILLED ILLEGALLY AT TELANGANA UNIVERSITY NZB VB

జాబ్ నోటిఫికేషన్లు రాకపోవడాకి కారణం ఇదే..! ఇలా చేస్తే ఇంకేం నోటిఫికేషన్లు వస్తాయ్..! ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు..

యూనివర్సిటీ వద్ద విద్యార్థులు

యూనివర్సిటీ వద్ద విద్యార్థులు

Illegal Posts: తెలంగాణ యూనివ‌ర్సిటీలో అక్ర‌మంగా తాత్కాలిక ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు అనే అరోప‌ణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా.. టీయూ ఎక్సిక్యూటివ్‌ సభ్యుల స‌మావేశం నిర్వ‌హించాకుండా ఉద్యోగాల భ‌ర్తీ చేయడంపై విద్యార్థి సంఘాలు మండిప‌డుతున్నాయి. డ‌బ్బులు తీసుకుని పోస్టులు ఇస్తున్నార‌ని ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  (P. Mahender, News18, Nizamabad) 

  తెలంగాణ యూనివ‌ర్సిటీలో అక్ర‌మంగా తాత్కాలిక ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తున్నారు అనే అరోప‌ణలు ఉన్నాయి. ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా.. టీయూ ఎక్సిక్యూటివ్‌ సభ్యుల స‌మావేశం నిర్వ‌హించాకుండా ఉద్యోగాల భ‌ర్తీ చేయడంపై విద్యార్థి సంఘాలు మండిప‌డుతున్నాయి. డ‌బ్బులు తీసుకుని పోస్టులు ఇస్తున్నార‌ని ఆరోపించారు. ఉన్నత విద్యాధికారుల నుంచి ఆదేశాలూ లేవు. ఇష్టం వచ్చిన రీతిలో అత్యవసరం పేరిట అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వారికి విధులను సైతం కేటాయిస్తున్నారు. టీయూలోని డిపార్ట్‌మెంట్‌లతో పాటు ఇతర శాఖల లో ఈ మధ్యనే అటెండర్లు, జూనియర్‌ అసిస్టెంట్‌లు, ఇతర పోస్టులను అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో వారికి అనుకూలమైన వారిని భర్తీ చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.. స్టాఫ్ కొర‌త ఉండ‌డంతో ఉద్యోగులను భ‌ర్తీ చేస్తామ‌ని యూనివ‌ర్సిటీ వీసీ అంటున్నారు.

  కోరలు చాస్తున్న ర్యాగింగ్.. దుస్తులను విప్పించి, రికార్డులు రాయించి.. దారుణంగా ఇబ్బందులకు గురి చేస్తున్న సీనియర్లు..


  నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి శివారులో 2006లో తెలంగాణ యూనివ‌ర్సిటీని ప్రారంభించారు. ఆ నాటి నుంచి ఎప్పుడు ఎదో స‌మ‌స్య వెంటాడుతానే ఉంది. తాజాగా ఓట్ సోర్సింగ్ ఉద్యోగుల భ‌ర్తీ విష‌యంలో ర‌గ‌డ జ‌రుగుతుంది.. ఎలాంటి ఆనుమ‌తులు లేకుండా 46 నాన్ టీచింగ్ పోస్టులు భ‌ర్తీ చేసార‌ని దూమారం రేగింది. ఏ పోస్టు భర్తీ చేయాలన్నా అనుమతులు తప్పనిసరి తీసుకోవాలి. ఈ మధ్యనే విశ్వ విద్యాలయంలో అటెండర్లు, జూనియర్‌ అసిస్టెంట్లను 12 మందికి పైగా తీసుకున్నారు. మరి కొంతమందిని తీసుకునేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

  ఇవే కాకుండా డ్రైవర్లు, కార్లను కూడా అవసరాల పేరునా అద్దెకు తీసుకున్నారు. వీసీతో పాటు ఇతర అధికారుల తనిఖీల కోసం ఉపయోగిస్తున్నారు. అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తాత్కాలిక అవసరాల పేరుతో తీసుకున్న ఈ పోస్టులకు ప్రభుత్వ, విశ్వవిద్యాలయ ఈసీ అనుమతులు లేకపోవడం గమనార్హం. త్వరలో జరిగే సమావేశంలో అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలో పరిధిలో అవుట్‌సోర్సింగ్‌ పోస్టులన్నీ ఇదే పద్ధతి లో భర్తీ చేస్తున్నారు. తర్వాత అనుమతులు తెచ్చుకుంటున్నారు.

  ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల సిపారరసుల పేరు చెప్పి భర్తీ చేస్తున్నారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా తమకు దగ్గరగా ఉన్నవారిని భర్తీ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో డబ్బు లు కూడా భారీగానే చేతులు మారుతున్నాయి. చివరకు సమావేశాలలో సరిపడా సిబ్బంది లేరని చెప్పి కొనసాగించడం కొసమెరుపు. అవసరాల పేరిట మూడేళ్ల క్రితం తీసుకున్న వారికి అనుమతులు ఇవ్వలేదు. ఈ పోస్టుల భర్తీ పై కూడా టీయూ అధికారులు సరైన కారణాలు చెప్పడం లేదు. నోటిపికేషన్ల ద్వారా తీసుకుంటే నిరుద్యోగులకు మేలు జరిగేదని విద్యార్థి సంఘాల నాయ‌కులు అంటున్నారు.. ఆక్ర‌మంగా తీసుకున్న ఉద్యోగుల‌ను తొల‌గించి నోటిఫికేష‌న్ ద్వారా ఎంపిక చేయాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు..

  ప్రేమించాడు.. ఆమెతో ఎన్నో కలలు కన్నాడు.. ప్రేమను ప్రపోజ్ చేసేసరికి ఆమె చెప్పిన సమాధానం ఎంటో తెలుసా.


  ఏజేన్సీ నుంచి తాత్కాలిక ఉద్యోగుల‌కు భ‌ర్తీ చేసామ‌ని తెలంగాణ యూనివ‌ర్సిటీ వీసీ డి.ర‌వింద‌ర్ అన్నారు. పని భారం.. సిబ్బంది కొరత వల్ల నాన్ టీచింగ్ ఉద్యోగుల‌ను తీసుకున్నామ‌ని తెలిపారు. అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస్తున్నారని ఆయ‌న మండిప‌డ్డారు. యూనివ‌ర్సిటీలో ఎదైన ప‌ద్ద‌తి ప్ర‌కారంగానే జ‌రుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

  తెలంగాణ విశ్వవిద్యాలయంలో అవినీతి, అక్రమాలపై సంఘాలు మండి ప‌డుతున్నాయి.. వర్సిటీ పాలక మండలిలో చర్చించకుండా, ఎటువంటి అధికారిక నోటిఫికేషన్లు ఇవ్వకుండా అక్రమంగా ముడుపులు తీసుకుంటూ 46 మంది నాన్‌ టీచింగ్‌ పోస్టులు భర్తీ చేశారని, ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా పాలక మండలి సభ్యులు వెంటనే స్పందించి పోస్టుల విషయం బహిర్గతం చేయలని డిమాండ్‌ చేశారు.

  గతంలో కూడా అక్రమ నియామకాలు చేపడితే రద్దు అయ్యాయని, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నియమించే ఉద్యోగాల పట్ల మార్గదర్శకాలు ఇవ్వడం శోచనీయమన్నా రు. ఎన్నో పోరాటల ద్వారా సాధించుకున్న టీయూ పరువును కాపాడాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఉన్నత విద్యా మండలి ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత వీసీ, రిజిస్ట్రార్‌లపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆందోళ‌న‌లు ఉదృతం చేస్తామ‌ని విద్యార్థి నాయ‌కులు హెచ్చ‌రిస్తున్నాయి.
  Published by:Veera Babu
  First published:

  Tags: Illegal registration, Nizamabad, Outsourcing jobs, Telangana jobs

  తదుపరి వార్తలు