Lovers: ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఎంత పని చేశారంటే..

ఆత్మహత్యాయత్నానికి యత్నించిన ప్రేమికులు

Lovers: ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుని కాపురం చేయాల‌నుకున్నారు. వీరి ప్రేమ‌ను కుటుంబ పెద్ద‌లు తెలిపారు. కానీ ఇరు కుటుంబ స‌భ్యులు వీరి ప్రేమను అంగీక‌రించలేదు. దీంతో ఇద్ద‌రం క‌లిసి ఉండ‌లేకపోయినా.. క‌లిసి ప్రాణాలు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇద్ద‌రు బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మ‌హ‌త్యాయత్నం చేశారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

 • Share this:
  (P. Mahendar, News18, Nizamabad)

  ఇద్ద‌రు ప్రేమించుకున్నారు.. పెళ్లి(Marriage) చేసుకుని కాపురం చేయాల‌నుకున్నారు. వీరి ప్రేమ‌ను కుటుంబ పెద్ద‌లు తెలిపారు. కానీ ఇరు కుటుంబ స‌భ్యులు వీరి ప్రేమను అంగీక‌రించలేదు. దీంతో ఇద్ద‌రం క‌లిసి ఉండ‌లేకపోయినా.. క‌లిసి ప్రాణాలు తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇద్ద‌రు బ్లేడ్ తో గొంతు కోసుకొని ఆత్మ‌హ‌త్యాయత్నం(Suicide) చేశారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి.. నిజామాబాద్(Nizamabad) న‌గ‌రంలోని జీజీ కాలేజిలో పీజీ చ‌దువుతోంది. ఇంటి నుంచి రావ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని కాళాశాల‌కు ద‌గ్గ‌లోనే రూం అద్దెకు తీసుకుని స్నేహితుల‌తో క‌లిసి ఉంటుంది.

  Mother-Son : తల్లి శవం పక్కన బాలుడి రోదన.. కంటతడి పెట్టించిన దృశ్యం..


  అయితే ఆ ఇంటి యజమాని కొడుకు ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తున్నారు.. కొంత కాలంగా వీరిద్ద‌రి మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకుందామ‌ని ఇరు కుటుంబాల పెద్ద‌ల‌కు విష‌యం చెప్పారు. కానీ పెద్ద‌లు అంగీక‌రించలేదు. ఇద్ద‌రి కులాలు వేరు కాబ‌ట్టీ మీ పెళ్లీకి ఒప్పుకోమని కుటుంబ పెద్ద‌లు చెప్పారు. మీరు మీ ప్రేమ‌ను మ‌రిచిపోయాలని హెచ్చ‌రించారు. ఇంకో సారి ప్రేమ.. అంటూ వెంటపడ్డారంటే.. మర్యాదగా ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రేమించుకున్నా వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు.


  Village Sarpanch: తాగిన మత్తులో పాఠశాలకు ఉపాధ్యాయుడు.. ఆగ్రహించిన సర్పంచ్ ఏం చేశాడంటే..


  వారి ప్రేమన మరిచిపోలేకపోయారు. దీంతో సోమవారం రాత్రి ఇంట్లో గొడవ పెట్టుకున్న ప్రేమికులు ఇంటి నుంచి వ‌దిలి బ‌య‌ట‌కు వ‌చ్చేసారు. పెద్దలు వారి పెళ్లికి ఒప్పు కోక‌పోవ‌డంతో వారు ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. చావులోనైన క‌లిసి ఉందామ‌నుకున్నారు.. అయితే సోమ‌వారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు.. దీంతో జిల్లాలోని డిచ్ పల్లి గ్రామ శివారు లోని పెద్దమ్మ ఆలయం వద్ద రాత్రికి ప‌డుకున్నారు.

  Love Story: ఆమెను ప్రేమించినట్లు నటించాడు.. చివరకు ఇలా జరుగుతుందని ఆమె ఊహించి ఉండదు.. ఏం జరిగిందంటే..


  మంగళవారం ఉదయం ఆలయం వెనుక కు వెళ్లి వెంట తెచ్చుకున్న బ్లేడుతో ఇద్దరు గొంతు కోసుకుని ఆత్మ‌హత్యాయ‌త్నం చేశారు.. అదే స‌మ‌యంలో ఆటు నుంచి వెళ్తున్న స్థానికులు చూసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు.. దీంతో స్పందించిన పోలీసులు వెంట‌నే స్థానిక ఆసుప‌త్రి తీసుకెళ్లి.. ప్ర‌థ‌మ చికిత్స చేయించారు. ఆనంత‌రం జిల్లా ప్ర‌భుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం ప్రేమికుల ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ప్రేమ జంట కుటుంబ స‌భ్యుల‌ను పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆంజ‌నేయులు తెలిపారు.
  Published by:Veera Babu
  First published: