Home /News /telangana /

So Sad: వాళ్ల విలువ దగ్గరగా ఉన్నప్పుడు తెలియలేదు.. తెలుసుకునే సమయానికి ఊహించని విధంగా..

So Sad: వాళ్ల విలువ దగ్గరగా ఉన్నప్పుడు తెలియలేదు.. తెలుసుకునే సమయానికి ఊహించని విధంగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

So Sad: బంధం, అనుబంధం, స్నేహం ఏదైనా.. దగ్గరగా ఉన్నప్పుడు దాని విలువ అనేది తెలియదు. దూరం అయితేనే దాని యొక్క ప్రాధాన్యత, విలువ తెలుస్తుంది. ఇలాంటి వాటిల్లో ఎక్కువగా హ్యూమన్ రిలేషన్ షిప్ లో ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగానే ఇక్కడ జరిగిన రెండు ఘటనలు. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  (P.Mahender,News18,Nizamabad)

  భార్యాభర్తల బంధం అనేది చాలా విలువైనది. ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉంటేనే వారి జీవితం.. ఎలాంటి గొడవలు లేకుండా ముందుకు సాగుతుంది. ఒక‌రి న‌మ్మ‌కాన్ని ఇంకొకరు నిలుబెట్టుకోలేక పోవ‌డంతో బార్య‌, భ‌ర్త‌ల్లో ఎవ‌రో ఒక‌రు బ‌లికావాల్సిన ప‌రిస్థితులు ఎర్పడుతున్నాయి. ఒక్క క్ష‌ణం ఆలోచిస్తే వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది..  కానీ ఆ దిశ‌గా ఆలోచించలేకపోవడంతో క్ష‌ణికావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణాయల కారణంగా ఎన్నో కుటుంబాలు బలవుతున్నాయి. ఇందులో భాగంగా.. ఓ ఘటనలో భార్య కాపురానికి రావ‌డం లేద‌ని ఓ భ‌ర్త బల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడు.

  అతడికి 25 ఏళ్లు.. పెళ్లైన 7 రోజులకే ఉపాధి కోసం సిటీకి వెళ్లాడు.. 6 నెలల తర్వాత ఇంటికి వచ్చేసరికి అతడి భార్య..


  మరో ఘటనలో భార్యభర్తల మధ్య గొడవతో.. భార్యను పుట్టింటికి పంపించాడు. తిరిగి కాపురానికి రావడం లేదని మనస్థాపం చెందిన భర్త ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు ఘటనలు నిజామాద్ జిల్లాలో చోటు చుసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి..   నిజామాబాద్  జిల్లా  న‌వీపేట్ మండ‌ల కేంద్రం లోని రైల్వేష్టేస‌న్ ఏరియాకు  చెందిన తుడుం రమేశ్‌(46), భార్య అనిత నివాసం ఉంటుంన్నారు. కొన్నాళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటాన్నాయి. దీంతో అనిత త‌న పుట్టికి వెళ్లి పోయింది.. గ‌త కొంత కాలంగా కాపురానికి రాక‌పోవ‌డంతో మ‌న‌స్తాపం చేసిన ర‌మేష్.. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

  Sadist Fathers: కన్న బిడ్డలపైనే కసాయి తండ్రుల కర్కశత్వం.. కాళ్లకు కరెంట్ షాక్ పెట్టి.. నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లి..


  భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. మ‌రోవైపు  ధర్పల్లి మండ‌లం ధనంబండ తండాకు చెందిన గుగ్లోత్‌ గణేశ్‌(26) కు ఐదు నెల‌ల క్రితం వివాహం జ‌రిగింది.. అయితే భార్య, భ‌ర్త‌ల మ‌ద్య చిన్న గొడ‌వ జ‌రిగింది.. దీంతో భార్యను ఇంట్లో నుంచి పుట్టింటికి పంపించేశాడు. దీంతో గ‌ణేష్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు, చుట్టు పక్కల వాళ్లు అతడిని హుటాహుటిన ఆర్మూర్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. మర్గమధ్యలోని కన్నుమూశాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

  Shocking Incident: ఎంత పని చేశావమ్మా.. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. ఇలా జరిగేది కాదు కదా..  క్ష‌ణికావేశంలో తీసుకునే నిర్ణ‌యాల‌తో కుటుంబాలు ఆనాథలుగా మారుతున్నాయి. వృద్దాప్యంలో తోడుగా ఉంటార‌నుకున్న పిల్ల‌లు ఆర్దాంత‌రంగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ‌డంతో త‌ల్లి దండ్రులకు తీరాని షోకాన్ని మిగుల్చుతున్నారు. సమస్యలను పెద్దలకు చెప్పి పరిష్కరించే దిశగా ఆలోచించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పై రెండు ఘటనలు కూడా.. వాళ్ల భార్యలు తమ వద్ద ఉన్నప్పుడు చులకనభావంతో చూశారు.. తీరా దూరం అయ్యేసరికి తట్టుకోలేక తనువు చాలించారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Nizamabad

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు