NAZIMABAD THE FATHER OF ONE FAMILY DIED DUE TO ELECTRIC SHOCK AND ANOTHER SON BECAME DISABLED IN KAMAREDDY NZB PRV
Sad Story: కరెంట్ ఆ కుటుంబంపై పగబట్టిందా? ఆ కుటుంబానికి కరెంటుకు సంబంధం ఏంటి?
చందు
పాము పడబడుతుందని అంటారు.. ఇదీ సైంటిపిక్ గా నమ్మదగినది కాదు.. కానీ పెద్దలు మాత్రం పాములు పగబడుతాయి అని చెబుతారు.. అయితే అచ్చంగా ఆలాగే ఓ కుటుంబం పై కరెంట్ పగపట్టింది.
పాము పడబడుతుందని అంటారు.. ఇదీ సైంటిపిక్ గా నమ్మదగినది కాదు.. కానీ పెద్దలు మాత్రం పాములు పగబడుతాయి అని చెబుతారు.. అయితే అచ్చంగా ఆలాగే ఓ కుటుంబం పై కరెంట్ (Electricity) పగపట్టింది.. కరెంట్ షాక్ తో కుటుంబ పెద్ద దూరం కాగా.. అదే కరెంట్ కొడుకును అవిటి వ్యక్తిగా మార్చింది. బాలుని జీవితాన్ని అంధకారం చేసింది. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి కరెంట్ షాక్ (Electric Shock) ల రూపంలో ఎదురైన ఆపద మరిన్ని కష్టాలను తెచ్చిపెట్టింది. చదువుకోవాలనే కోరిక ఉన్నా.. రెండు చేతులు, ఓ కాలు లేక చందు మంచానికే పరిమితమయ్యాడు. కామారెడ్డిలో ఓ విధి వంచితునిపై విషాద గాథ.
12 ఏళ్ల క్రితం తండ్రి..
కామారెడ్డి (Kamareddy) జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన కిష్టవ్వ- బాల కిషన్ దంపతులు. వీరి కుమారుడు చందు (Chandhu). కూలీ చేస్తే గాని మూడు పులట బోజనం దొరకదు.. అయితే ఈ కుటుంబం పై కరెంట్ పగ పట్టింది. 12 ఏళ్ల క్రితం కూలీ పనులకు వెళ్తున్న బాల కిషన్ కు విద్యుత్ తీగలు తగిలి (Current shock) ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడ్డింది. ఆనాటి నుంచి ఆ కుటుంబాన్ని కూలీ పని చేస్తూ తల్లి కిష్టవ్వ పోషిస్తుంది. అయితే తల్లి కష్టాన్ని చూడలేక చందు తల్లికి సహయం చేయాలనుకున్నాడు. అయితే గత ఏడాది లాక్ డౌన్ సమయంలో చందూ పెయింటింగ్ పనులకు వెళ్లాడు. తల్లికి ఆసరాగా ఉంటున్నాడు. కుటుంబం మూడు పుటల కడుపు నిండా తింటుంది. అయితే ఓ రోజు చందూ పెయింటింగ్ వేస్తుండగా విద్యు త్ తీగలు తగిలి కుప్పకూలాడు (Current shock).
కడుపు నిండని దైన్య పరిస్థితిలో..
తీవ్రగాయాలు అయినా చందూను ఆసుపత్రికి తరలించారు.. వైద్యులు రెండు చేతులు, ఓ కాలు తొలగించి (Disability) ప్రాణాలను కాపాడారు. దీంతో చందు అప్పటి నుంచి మంచానికి పరిమితమయ్యాడు. తన పని తాను చేసుకోలేని పరిస్థితి.. దీంతో తల్లి కిష్టవ్వ చందును చంటి పాపలా కంటికి రెప్పలా కాపాడుతోంది. కూలీ చేస్తే కానీ కడుపు నిండని దైన్య పరిస్థితిలో ఉండి.. కొడుకును చూసుకుంటుంది. కూలీ చేయలేక అవస్ధలు పడుతోంది. కనీసం చందుకు పెన్షన్ ఇచ్చి సర్కారు ఆదుకోవాలని ఆ తల్లి కిష్టవ్వ కోరుతోంది.
మా ఆయన కరెంట్ షాక్ తగిలి చనిపోయారని, . ఇప్పుడు మా బాబు ఈ పరిస్థితి కూడా కరెంటే కారణం అన్నారు. దేవుడు మా కుటుంబం పై కరెంటు రూపంలో పగబట్టాడని కన్నీటి పర్యంతం అయింది ఆ ఇల్లాలు. అమ్మ కష్టానికి తోడుగా ఉండాలని కూలీ పనికి వెళ్లనని చందూ చెబుతున్నారు. కానీ కొద్ది రోజులకే కరెంట్ షాకుతో అవిటివానిగా మారానని చందు ఆవేదన చెందాడు. మా నాన్న కరెంట్ షాక్ తో చనిపోయారని, ఇప్పుడు నేనుకూడా ఆదే కరెంటుకు బలయ్యాను అని బోరుమన్నాడు. తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
చేతికొచ్చిన కొడుకు కుటుంబానికి ఆసరా అవుతాడనుకుంటే.. అవిటివాడిగా మారడాన్ని చూసి.. ఆ తల్లి హృదయం తల్లడిల్లుతోంది. కుమారుడ్ని చంటి పిల్లాడిలా సాకాల్సి రావడం ఆమెను మరింత కుంగదిస్తోంది. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేస్తూనే.. కుమారుని ఆలనా పాలనా చూస్తోంది కిష్టవ్వ. కనీసం పెన్షన్ ఇచ్చి.. తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటోంది. కిష్టవ్వ కష్టం చూసి కాలనీ వాసులు ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.