హోమ్ /వార్తలు /తెలంగాణ /

Orphan: ఆరు నెలల వయస్సులోనే... అనాథగా మారిన బాలుడు.. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి..

Orphan: ఆరు నెలల వయస్సులోనే... అనాథగా మారిన బాలుడు.. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి..

కార్తీక్

కార్తీక్

Orphan: ఆ బాలునికి అమ్మ ప్రేమ‌.. నాన్న ఆనురాగం తెలియ‌దు..  ఆరు నెలల వయసులో అనాధగా మారాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆప‌హ‌రిచుంకు వెళ్లాడు.. తీరా పోలీసుల కంటపడి శిశు గృహానికి చేరుకున్నాడు. హైదరాబాద్ శిశు గృహాల్లో తాత్కాలిక  వసతి పొందాడు. ప్ర‌స్తుతం నిజామాబాద్ శిశు గృహకు త‌ర‌లించారు.

ఇంకా చదవండి ...

(P.Mahender,News18,Nizamabad)

ఆ బాలునికి అమ్మ ప్రేమ‌.. నాన్న ఆనురాగం తెలియ‌దు..  ఆరు నెలల వయసులో అనాధగా మారాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆప‌హ‌రిచుంకు వెళ్లాడు.. తీరా పోలీసుల కంటపడి శిశు గృహానికి చేరుకున్నాడు. హైదరాబాద్ శిశు గృహాల్లో తాత్కాలిక  వసతి పొందాడు. ప్ర‌స్తుతం నిజామాబాద్ శిశు గృహకు త‌ర‌లించారు. నా అనే వారు ఎవ‌రో తెలియక మూడేళ్లుగా బాలుడు ఆనాథగా మిగిలి పోయాడు. బాలుడి బంధువుల కోసం ఆరా తీస్తున్న కుటుంబ సభ్యులు ఆచూకీ మాత్రం ల‌భించలేదు. చిట్టి అడుగులు వేస్తూ ఉత్స‌హంగా క‌నిపిస్తున్న ఈ బుడ్డోడు అమ్మ కొసం ప‌రితపిస్తున్నాడు. అమ్మ- నాన్న‌ల కోసం ధీనంగా చూస్తున్న ఈ బాలుని పేరు కార్తీక్ .  నిజామాబాద్ శిశు గృహ సిబ్బంది ఆ బాలునికి అమ్మానాన్నగా మారి ఆలనాపాలనా చూస్తున్నారు. కార్తీక్ అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.

OMG: కూలి పని కోసం వెళ్లి.. తెలిసిన వారితో చెరుకు తోటకు ఒకరు, కంది చేనుకు మరొకరు వెళ్లారు.. చివరికి ఇలా..


ఆరు నెలల వయస్సులో కార్తీక్ అమ్మ ప్రేమకు దూరం అయ్యాడు. నిజామాబాద్ బ‌స్టాండ్ ప్రాంతంలో భిక్షాటన చేస్తున్న ఓ మహిళ నుంచి ఈ బాబుని ఓ వ్య‌క్తి కొనుగోలు చేశాడు. అయితే ఆ బాబును  హైదరాబాదుకు తీసుకెళ్తుండగా బోయిన్ ప‌ల్లి పోలీసులు ఆనుమానాస్ప‌దంగా క‌నిపించిన ఆ వ్య‌క్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అసలు విష‌యం బ‌య‌ట ప‌డింది. నిజామాబాద్ లో భిక్షాటన చేస్తున్న మహిళ నుంచి కొనుగోలు చేశాన‌ని చెప్పాడు. దీంతో 2019 జూన్ 23 బోయిన్ పల్లి పోలీసులు ఆ బాబును తాత్కాలిక వసతి కోసం హైదరాబాద్ లోని శిశు విహ‌ర్ లో ఉంచారు.  బాలుని తల్లిదండ్రుల ఆచూకీ కోసం శిశు గృహ సిబ్బంది విచారించినా ఫ‌లితం లేకుండా పోయింది. దీంతో ఈ కేసు తదుపరి దర్యాప్తు కోసం హైదరాబాద్ చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు నిజామాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కి బదిలీ చేశారు.

Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


ఇప్పుడు ఆ బాలునికి ఆలానా పాల‌న శివు గృహ సిబ్బంది చూసుకుంటున్నారు. ఎంత‌ ప్రేమగా చూసుకున్న క‌న్న త‌ల్లి లేని లోటు మాత్రం తీర్చలేక పోతున్నారు. అనిపించిన వారిలో కుటుంబ సభ్యులను చూస్తూ పెరుగుతున్నాడు. సరిగా మాటలు కూడా రాని ఈ బాలుడికు శిశు గృహ సిబ్బంది  చిన్నచిన్నగా మాటలు నేర్పుతున్నారు. బాబు కు సంబంధించి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే నిజామాబాద్ శిశు గృహం లో సంప్రదించాలని కోరుతున్నారు. బాలుడి అసలు తల్లిదండ్రులు రాకపోతే దత్తత ఇచ్చేందుకు సైతం రెడీ అవుతున్నారు. కార్తీక్ కు అన్ని తామై చూసుకుంటున్నాము.. కానీ త‌ల్లి లేని లేటును మాత్రం తీర్చ‌లేక పోతున్నామ‌ని శిశుగృహ మ్యానేజ‌ర్ అనిత అంటున్నారు.


Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


ఆరు నెల‌ల వ‌య‌స్సు నుంచి శిశు గృహ‌ంలోనే ఉంటున్నాడు. ఇప్పుడు ముడేళ్ల వ‌య‌స్సు అయినా ఆ బాబు త‌ల్లి దండ్రులు ఎవ‌రు అనేది తెలియడం లేదు.. ఆ బాబు త‌ల్లి దండ్రులు ఎవ‌రైనా ఉంటే మా శిశు గృహ‌కు వ‌చ్చి వారి ఆధారాలు చూపిస్తే.. డీఎన్ఏ టెస్టు చేసిన తర్వాత చైల్డ్ వేల్పేర్ ఆధికారులు బాబును వారికి అప్ప‌గిస్తారని చెప్పింది.  ఆరు నెలల క్రితం అమ్మఒడికి దూరమైన ఈ చిన్నోడు మూడేళ్ల వయస్సుకు వ‌చ్చినా త‌ల్లి ప్రేమ‌ను పొంద‌లేక పోతున్నాడు . మూడేళ్లుగా అనాధల మధ్య ఓ అనాధల మిగిలిపోయాడు. అమ్మ ప్రేమకు నాన్న అనురాగానికి ఎందుకు దూరమయ్యాడో తెలియక బాబు దీనంగా చూస్తున్నాడు. ఎవరి స్వార్థానికి అనాధగా మిగిలిపోయాడనేది అర్థంకాని పరిస్థితి.

First published:

Tags: Crime, Nizamabad, Nizamabad District

ఉత్తమ కథలు