హోమ్ /వార్తలు /తెలంగాణ /

corona kits : కవిత చెప్పింది... కిట్లు చేరాయి..హర్షం వ్యక్తం చేస్తున్న కరోనా భాదితులు

corona kits : కవిత చెప్పింది... కిట్లు చేరాయి..హర్షం వ్యక్తం చేస్తున్న కరోనా భాదితులు

కవిత (ఫైల్ ఫోటో)

కవిత (ఫైల్ ఫోటో)

mlc kavitha twitter response : ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా పరీక్ష చేసేందుకు కిట్ల కొరత ఉండడంతో కొరుట్ల స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ కవితకు ట్విట్టర్ ద్వార విషయాన్ని తెలియజేశారు. దీంతో స్పందించిన కవిత 7500 కొవిడ్ పరీక్ష కిట్లు ఆసుపత్రికి చేరేలా చర్యలు చేపట్టారు.

ఇంకా చదవండి ...

ప్రభుత్వ దవాఖానాల్లో కరోనా పరీక్ష చేసేందుకు కిట్ల కొరత ఉండడంతో కొరుట్ల స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ కవితకు ట్విట్టర్ ద్వార విషయాన్ని తెలియజేశారు. దీంతో స్పందించిన కవిత 7500 కొవిడ్ పరీక్ష కిట్లు ఆసుపత్రికి చేరేలా చర్యలు చేపట్టారు.

కరోనా ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే..కరోనా లక్షణాలు ఉన్నా వాటిని పరీక్షించేందుకు కొన్ని జిల్లాల్లో సరైన టెస్టులు చేసేందుకు కిట్లు లేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రజలు చాల మంది ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన భాదితులు ఎమ్మెల్సీ కవితకు తమ భాదను ట్విట్టర్‌లో తెలియజేశారు. ముఖ్యంగా కోరుట్ల, మెట్ పల్లి ప్రాంతాల్లో పరీక్షలు చేయించుకునేందుకు తగినన్ని కిట్ లేవని, ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పలువురు ట్విట్టర్ ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో స్పందించిన ఎమ్మెల్సీ కవిత వైద్యారోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు, జగిత్యాల కలెక్టర్ లను ట్విట్టర్ లో ట్యాగ్ చేస్తూ, సమస్యను పరిష్యరించాల్సిందిగా కోరారు. కవిత ట్వీట్ పై స్పందించిన వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సైతం సంబంధిత వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులకు పరీక్ష కిట్‌లను పంపించాల్సిందిగా కోరాు. దీంతో రేపటి నుండి కొత్తగా పదివేల కరోనా టెస్టింగ్ కిట్ లు కోరుట్ల, మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి రానున్నాయని వైద్యాధికారులు తెలిపారు.

మరోవైపు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో అంబులెన్స్ ల కొరత ఉందని, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్సీ కవిత గారితో ప్రస్తావించారు. దీంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, సిరికొండ మండలానికి అంబులెన్స్ మంజూరు చేయించారు.

First published:

Tags: Nizamabad

ఉత్తమ కథలు