(P.Mahender,News18,Nizamabad)
బంగారు తెలంగాణ రాష్ట్రంలో బడిబాట అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దుతామని ప్రగల్బాలు పలికిన పాలకులు, అధికారులు ప్రభుత్వం పాఠశాలను కనీసం పట్టించుకోవడం లేదు. విద్యా బోధన అటుంచితే, కనీసం విద్యార్థులకు కూర్చోడానికి సరైన భవనాలు లేకుండా పోయాయి. గ్రామంలో ఉన్న పల్లెప్రకృతి వనంలో ఉన్న చేట్లే విద్యార్థులకు నిడనిస్తున్నాయి. చెట్ల కింది చదువులకు పిల్లలను పంపేందుకు భయపడుతున్న తల్లిదండ్రులు.. మా గ్రామానికి ఓ శ్రీమంతులు వచ్చేవరకు మా పాఠశాల పరిస్థితి మారదా.. అని ఏదురుచూస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్షం వస్తే పక్కనే ఉన్న అంగన్వాడీ భవనంలోకి వెళ్లడం, వర్షం పోయిన తర్వాత తిరిగి చెట్ల కిందకు రావడం విద్యార్థులకు ఆనవాయితీగా మారింది.
విద్యార్థులు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎండలో ఎండుతూ వానలో నానుతూ.. చలికి వణికిపోతూ.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలో మొత్తం 38 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాద్యాయులు విద్యార్థులకు విద్యబోధన చేస్తున్నారు.. గతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిల దశకు చేరుకుంది.. ముందు భాగం బాగానే కనిపించినా వెనుక భాగం పూర్తిగా కులీపోయింది.. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణ ఆరుబయటే ఉన్న పల్లెప్రకృతి వనం చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్నా... అధికారులు గాని .. ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులపై ఎందుకు ఇంత చిన్నచూపు అని తండావాసులు ప్రశ్నిస్తున్నారు.
ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారే తప్ప.. పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సభలు, సమావేశాలలో ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని ఉపన్యాసాలు ఇచ్చే అధికారులు.. ప్రజా ప్రతినిధులు విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయల గురించి మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఆరుబయట చెట్ల కింద చదువుకోడంతో వారి వద్దకు పాములు, విష కీటకాలు వస్తున్నాయి. విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో పాములు రావడంతో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆరుబయట విద్యార్థులకు ఎలాంటి రక్షణ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నాని విద్యార్థుల తల్లి దండ్రులు ఆందోళన చెందుతున్నారు.
మధ్యాహ్న భోజనం సైతం ఆరుబయట ఎండలో కూర్చొని తింటున్నారు. త్రీవమైన చలి లో సైతం విద్యార్థులు ఆరుబయటే ఉండడంతో వారి ఆరోగ్యం విషయంలో ఆందోళనగా ఉందని కుటుంబసభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనం మంజూరు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు భవనం లేక తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయని ప్రధానోపాధ్యాయురాలు హేమలత అన్నారు.
ప్రభుత్వం వెంటనే భవనాన్ని మంజూరు చేయాలని గత నాలుగు సంవత్సరాలుగా పై అధికారులకు చెబుతున్నాము.. విద్యార్థులకు ఆరుబయటే ఉన్న పల్లెప్రకృతి వనం చెట్ల కింద కూర్చోబెట్టి విద్యను బోధిస్తున్నాం.. వర్షం పడితే ప్రక్కనే ఉన్న ఆంగన్ వాడి సెంటర్ లో తలదాచుకుంటున్నము.. ఎండను సైతం తట్టుకోలేకపోతున్నామని .. పాఠశాల భవనం లేకపోవడంతో విద్యార్థులకు సరైన విద్యను అందించలేకపోతున్నామని ఉపాధ్యాయుడు సతీష్ కుమార్ అన్నారు. ఎన్ని సార్లు అధికారులకు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదు. విద్యార్థులకు ఆరుబయట చెట్ల కింద కూర్చోబెట్టి విద్యని అందిస్తున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.