(P.Mahender,News18,Nizamabad)
అర్థరాత్రి వింత శబ్దాలు.. అటూ ఇటూ కదులుతున్న మనిషి ఆకారం.. నీడలాంటి దృశ్యాలు.. నిత్యం ఇదే పరిస్థితి. దీంతో హాస్టల్‌లో దెయ్యం ఉందని విద్యార్థులు బయందోళనకు గురయ్యారు. హాస్టల్ లో ఉండేందుకు ధైర్యం చాలక ఇంటిబాట పట్టారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మోడల్ స్కూల్స్, జూనియర్ కాలేజీలను ప్రారంభించింది.. మండలానికి ఒక్క మోడల్ స్కూల్, మోడల్ జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేశారు. ఈ మోడల్ పాఠశాలలు, కళాశాలు విజయంతంగా నడుస్తున్నాయి. అయితే కామారెడ్డి జిల్లా నాగిరెడ్టిపేట ఆదర్శ పాఠశాల బాలిక వసతి గృహంలో ఇంటర్‌కు చెందిన 60 మంది విద్యార్థినులు ఉంటున్నారు.
వారం రోజులుగా రాత్రి అయ్యిందంటే చాలు. వసతి గృహం పరిసరాల్లోంచి వింతవింత అరుపులు, శబ్ధాలు వస్తున్నాయని విద్యార్థినులు చెబుతున్నారు. అలాగే దెయ్యంలా కదులుతున్న నీడలు కనిపిస్తున్నాయని భయాందోళన చెందుతున్నారు. ఈ విషయమై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ పట్టించుకోక పోవడంతో విద్యార్థినిలను హాస్టల్ నిర్వహకులు పిల్లలను వారి తల్లిదండ్రులకు పోన్ చేసి ఇంటికి తీసుకు వెళ్లాలని చూచించారు. దీంతో విద్యార్థినిల తల్లిదండ్రులు భయపడకుంటూ వచ్చి వాళ్లను తీసుకెళ్లారు. దీంతో హాస్టల్ పూర్తిగా ఖాళీ అయింది. విద్యార్థినుల సమస్యను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామని ప్రిన్సిపాల్ శ్రీలత తెలిపారు.
రాత్రుల్లో విద్యార్థినులకు తోడుగా హాస్టల్‌లో వాచ్‌మన్, వంట మనిషి, ఏఎన్‌ఎం సైతం ఉంటున్నారన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది.. అనే విషయాలను తేల్చాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అయితే హస్టల్ లో ఉన్న సమస్యలను పరిస్కరించాల్సింది పోయి.. విద్యార్థులను ఇంటికి పంపించాలడమేంటని పేరేంట్స్ అంటున్నారు. రాత్రికి హస్టల్ లో కరెంటు లేదు.. సరిగ్గా బల్బులు కూడా లేవని ఆయన అన్నారు. మా పిల్లలకు వచ్చిన భయాన్ని పోగోట్టాలని అయన అన్నారు.
డిజిటల్ యుగంలో కూడా దెయ్యాలు ఉన్నాయా... దెయ్యం ఉందని ఆనుమానంతో భయందోళనకు గురవుతున్న విద్యార్థినులు.. పై అధికారులు.. జన విజ్ఞాన వేదిక వారు ముందుకు వచ్చి పిల్లలకు ధైర్యం చేప్పాల్సిన అవసరం ఎంతైన ఉంది. ఈ కాలంలో కూడా దేయ్యలేంటి అని స్థానికులు అనుకుంటున్నారు. అయితే ఇది ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాల్సిన బాధ్యత పోలీసులు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hostel students, Ladies, Nizamabad District, Schools