(P.Mahender,News18,Nizamabad)
గులాబ్ తుఫాన్(Cyclone) నుంచి పంటను రక్షించుకుని.. ఆరుగాలం కష్టపడి పండిన పంటను మార్కెట్(Market) కు తీసుకు వెళ్లితే రైతుకు నిరాశేమిగుతుంది. రోజు రోజుకూ ధరలు పతనమవుతున్నాయి. సోయా ధర బాగుందని మురిసిపోయిన రైతన్న ఆశలకు గండిపడింది. సీజన్ ప్రారంభంలో 8వేల నుంచి 7వేల ఐదు వందల వరకు పలికిన సోయా ధర.. ఇప్పుడు 5వేల నుంచి నాలుగు వేల ఐదు వందలకు పడి పోయింది.. దీంతో సోయా రైతులు (farmers) ఆందోళన చెందుతున్నారు.
ఈ నామ్ ద్వారా కొనుగొళ్లు చేస్తున్న వ్యాపారులు వారి చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని రైతులు వాపోతున్నారు. మార్కెట్ కు పంట పెద్ద ఎత్తున వస్తుండడంతో వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ యేడు 65వేల ఎకరాల్లో సోయా సాగు చేశారు. అయితే గత యేడుతో పోల్చితే ఈ యేడు సాగు విస్తీర్ణం తగ్గింది.
దీంతో ఈ యేడు ఎన్నడా లేని విధంగా సోయాకు మంచి ధర పలుకుతోంది. అయితే గులాబ్ తూఫాన్ పంటలను నష్టపరిచింది. అయినా రైతులు ఎలాగోల ఆరుగాలం కష్టపడి పండించిన సోయా పంట మార్కెట్ కు తరలిస్తున్నారు. గత 20 రోజుల నుంచి నుంచి వ్యవసాయ మార్కెట్ కు సోయా వస్తుంది.. మొదట్లో క్వింటాలుకు రూ.7500ల నుంచి రూ.6500లవరకు పలికింది.. అయితే మార్కెట్కు పెద్ద ఎత్తున సోయా పంట రావడంతో ధరలు తగ్గుతుండడంతో రైతులు ఆదోళన చెందుతున్నారు.. రెండు రోజుల వ్యవధిలో సుమారు రెండు వేల రూపాయల వరకు ధర తగ్గింది.
దీంతో రైతులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అయితే జైయింట్ కలెక్టర్ చంద్రశేఖర్ గురువారం మార్కెట్ ను సందర్శించారు. వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. వ్యాపారులు రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని అయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
. అయితే గతంతో ఎన్నాడు లేనివిందగా ఈ యేడు సోయకు మంచి ధర ఉంది.. దీంతో ఈ యేడు లాభాలు పొందుతామాని ఆశ పడిన రైతులకు ఈ యేడు నిరాశే మిగిలింది. సోయా ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఖరీఫ్లో పంట దిగుబడులు కొంత వరకు పర్వాలేదు అనుకున్న తరుణంలో వ్యాపారులు సిండికేటుగా మారి ధర తగ్గించడంతో తీవ్రంగా నాష్టపోతున్నామని ఆలూరు రైతు రాజన్న చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nizamabad