NAZIMABAD SOFTWARE ENGINEER COMMITS SUICIDE OVER HUSBAND PARENTS HARASSMENT IN KAMAREDDY NZB VB
OMG: కవల పిల్లలతో ఆ జంట ఎంత చూడముచ్చటగా ఉన్నారో చూడండి.. ఎందుకు ఇలా చేశారో మరి..
పిల్లలతో దంపతులు (ఫైల్)
OMG: కామారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎంతో అన్యోన్యంగా.. కవల పిల్లలతో ఉన్న ఆ జంటలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. దీంతో ఒక నిండు ప్రాణం బలైంది. అసలు ఏమైంది.. వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
సాఫ్ట్ వేర్(Software) ఉద్యోగం (Job) అంటేనే ఎంతో ఓత్తిడితో కూడుకున్నది. ఆలాంటి ఉద్యోగంలో ఉంటూ అత్తింటి వారి ఓత్తిని తట్టుకోలేక ఓ సాప్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అయితే భర్త, అత్తమమాలే హత్య చేసిన ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దేవునిపల్లి ఎస్సై రవికుమార్ కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు దేవునిపల్లి కి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి హరిప్రసాద్(35) కు నిజామాబాద్ కు చెందిన శిరీష(32) కు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిపించారు. అన్ని లాంఛనలతో పెళ్లి చేశారు.
అయితే వీరిద్దరు బెంగుళుర్ లో సాప్ట్ వేర్ ఉద్యోగాలుగా పనిచేసేవారు. అయితే కరోనా కారణంగా ఇంటి నుంచే సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నారు.. దీంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్ లో నివాసం ఉంటున్నారు. వీరికి రెండు సంవత్సరాల కవల పిల్లలు.. పాప, బాబు ఉన్నారు.
కొన్నాళ్లుగా భర్తతోపాటు అత్త బాలరాజవ్వ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పుట్టింటి నుంచి డబ్బులు తేవాలని ఒత్తిడి చేసేవారు. ఈ క్రమంలో మనస్తాపం చెందిన ఆమె అందరూ నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
ఇంట్లో ఉన్న సీసీ టీవీ ఉదయం 3 గంటల నుంచి 6 గంటల మధ్య పనిచేయక పోవడంతో మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లయిన నాటి నుంచి తరచూ భర్త, అత్తమామలు వేదిస్తూ ఉండేవారని శిరీష తల్లి దండ్రులు చెబుతున్నారు. వారి కొత్త ఇంటి నిర్మాణానికి డబ్బులు తీసుకురావాలని మా అమ్మయి పై ఒత్తిడి తీసుకువచ్చారు..
ఇదీ ఖచ్చితంగా భర్త హరి ప్రసాద్ చంపి ఉంటాడని ఆరోపిస్తున్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలని పరితపించేదని, కానీ ఆశలు తీరకుండానే ఆయువు తీశారని కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.