ఖాకీ సినిమా తరహాలో చోరీలు -హైవేపై దొరకరు, ఊరికెళితే పట్టుపడరు -Nizamabad పోలీసులకు చుక్కలు

నిజామాబాద్ హైవేపై ఏటీఎం చోరీ, పోలీసుల పరిశీలన

జాతీయ హైవేను ఆనుకుని ఉన్న ఊళ్లు, పట్టణాలే వారి టార్గెట్.. లారీల్లో సరుకు సవాణా చేస్తున్నట్లు నటిస్తూ దొంగతనాలకు పాల్పడుతుంటారు.. సీసీటీవీ కెమెరాలకు స్ప్రే కొట్టడం దగ్గర్నుంచి నేర స్థలంలో ఏ చిన్న అనవాలు కూడా వదిలిపెట్టరు.. అవును, అచ్చం ఖాకీ సినిమా తరహాలోనే నిజామాబాద్ జిల్లాలో వరుస చోరీలు జరుగుతున్నాయి. రక్తపాతం, హత్యలు లేనప్పటికీ ఒక రేంజ్ లో రెచ్చిపోతోన్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గుర్తించడానికే జిల్లా పోలీసులు నానా తంటాలు పడుతున్నారు..

 • Share this:
  (P.Mahender,News18,Nizamabad)
  నిజామాబాద్ జిల్లాలో ఖాకీ సిన‌మా త‌ర‌హాలో పెరుగుతోన్న దొంగతనాలు ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. హైవే వెంబ‌డి ఎటీఎంలు, తాళం వేసిన ఇళ్ల‌ను లూటి చేస్తూ.. సీసీ కెమెర కంటికి కూడా చిక్క‌కుండా.. చిన్న ఆనవాలు సైతం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారా దొంగలు. తాజాగా జిల్లాలోని 44వ నంబర్ జాతీయ రహ‌దారి ప‌క్క‌న ఉన్న ఏటీఎం నుంచి దొంగలు రూ. 11లక్ష‌ల దోచుకెళ్లారు. ఇది కూడా అంతర్రాష్ట్ర దొంగలపనే పోలీసులు భావిస్తున్నారు..

  44వ నంబర్ నేషనల్ హైవేపై.
  నిజామాబాద్ జిల్లాలో బిక్క‌నూర్ నుంచి పొచంపాడ్ వ‌ర‌కు సుమారు వంద కీలోమీట‌ర్ల మేర 44వ జాతీయ రహ‌దారి ఉంది. ఖాకీ సినిమాలో లారీల్లో వ‌చ్చి దొచుకున్న‌ట్టుగా... నిజామాబాద్ జిల్లాలోనూ ర‌హ‌దారి వెంట కొంత కాలంగా ఎటీఎం లు, తాళం వేసిన ఇళ్లను దొంగలు గుల్ల చేస్తున్నారు. 44వ జాతీయ ర‌హ‌దారి వెంట వేల సంఖ్య‌లో లారీలు ప్ర‌యాణిస్తుండ‌డంతో వారిని అదుపు చేయ‌డం పోలీసుల‌కు త‌ల‌కుమించిన బారంగా మారింది.

  తాజాగా ఏటీఎం చోరీ
  రెండు రోజుల కిందట ఇందల్‌వాయి ఏటీఎం చోరీ ఘటనను పరిశీలించిన పోలీసులు అంత‌ర్రాష్ట్ర ముఠా దోపిడీకి పాల్పడిందని అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. ఏటీఎంను ధ్వంసం చసన దొంగలు రూ.11.31 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, యూపీ, బిహార్‌, హరియాణాకు చెందిన ముఠాలు గ‌తంలోను చోరీల‌కు పాల్ప‌డ్డారు. చోరీలకు అలవాటుపడిన పలు ముఠాలు ఈ వాహనాల్లో ప్రయాణించి రహదారి వెంబడి ఉండే ఇళ్లు, ఏటీఎంలను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్నాయి.

  పోలీసులను తన్ని తరిమేశారు..
  నిజామాబాద్ జిల్లాకు స‌రిహ‌ద్దులో మహారాష్ట్ర ఉండ‌డంతో పాటు రైలు మార్గం ఉంది.. దీంతో మహారాష్ట్ర దొంగ‌ల‌ ముఠాలు నగరంలోకి వచ్చి దొంగతనాలు చేసి రాత్రికి రాత్రి ఉడ‌యిస్తున్నారు.. దీంతో పోలీసుల‌కు చిక్క‌డం లేదు.. అయితే దొంగ‌ల ముఠాను వెతుకుంటు ఆ రాష్ట్రానికి వెళ్లిన ఓ బృందనికి ఆస‌లు విష‌యం తెలిసింది.. ఆ మారుమూల గ్రామాల్లో నివసించే కుటుంబాలు చోరీలే వృత్తిగా ఎంచుకుని జీవిస్తున్నాయి. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితులను పట్టుకోవడం అంత సులువు కాదని గ్ర‌హించారు.. ఈ ముఠాల సభ్యులే జిల్లాలో జరిగిన అనేక దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారని స‌మాచారం.. గతంలో డిచ్‌పల్లి మండలంలోని ఓ వివాహ వేడుకలో భారీ చోరీ జరిగింది. డిచ్‌పల్లి పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా యూపీ ముఠాగా గుర్తించారు. వారిని పట్టుకొనేందుకు అక్కడికి వెళ్లిన బృందంపై వారంతా ఏకమై దాడికి యత్నించారు. పోలీసులు తప్పించుకొని వచ్చేశారు.

  పక్కరాష్ట్రాల గ్యాస్ సిలిడర్లతో..
  ఇందల్‌వాయి మండలంలో ఏటీఎం నుంచి నగదు దోచుకెళ్లిన కేసులో పోలీసులు వేగం పెంచారు.. మొద‌ట‌ ఏటిఎం వ‌ద్ద గ‌ల సీసీ కెమెరాల‌కు స్పే చేసి అవి ప‌నిచేయాకుడా చేసారు.. దీంతో వారి దృష్యాలు సిసి కెమెరాకు చిక్క‌లేదు.. గ్యాస్‌ కట్టర్‌ సాయంతో ఏటీఎంను ధ్వంసం చేసి రూ.11.31 లక్షల న‌గ‌దును ఎత్తుకెళ్లారు. అయితే చోరీకి ఉపయోగించిన గ్యాస్ సిలిండ‌ర్, ఆక్సిజన్‌ సిలిండర్ రెండు కూడా వేరే రాష్ట్రాలకు చెందినవిగా పోలీసులు గుర్తించారు.. దీంతో డీసీపీ అరవింద్‌బాబు బుధవారం ఇందల్‌వాయి టోల్‌ప్లాజా వద్ద సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. అనుమానిత వాహనాల వివరాలు సేకరించేందుకు ఓ టీంను ఏర్పాటు చేశారు. పక్కా పథకం ప్రకారం దోపిడీ జరగడంపై ప్రొఫెషనల్‌ ముఠా పనిగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

  దొంగల్ని గుర్తించి పట్టుకునేది ఎప్పుడు?
  అంతరాష్ట్ర ముఠాలను కట్టడి చేయడంలో పోలీసుల నిఘా వైఫల్యం కార‌ణం అని తెలుస్తుంది.. జిల్లా స‌రిహ‌ద్దులో జాతీయ రహదారి పై ఎప్ప‌టికి అప్పుడు త‌నిఖీలు చేయాల్సిన పోలీసులు చేయ‌క పోవ‌డంతో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుత‌న్నాయ‌ని స్థానిక ప్ర‌జ‌లు బ‌యందోళ‌న‌కు గుర‌వుతున్నారు.. ఇప్ప‌టికైన పోలీసు వ్య‌వ‌స్ద మ‌రింత గ‌ట్టి నిఘా ఎర్పాటు చేసిన ప్ర‌ల‌జ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరుతున్నారు..
  Published by:Madhu Kota
  First published: