NAZIMABAD RTC BUS HIT A RUNNING AUTO TWO PEOPLE DIED IN NIZAMABAD VRY NZB
RTC bus Accident : ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ఇద్దరు మృతి,మరొకరు పరిస్థితి విషమం..
bus accident
RTC bus Accident : ఆర్టీసీ బస్సు ఓవర్ స్పీడుతో ఓ ఆటోను ఢికొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. బస్సు ఢీకొట్టిన ఆటో నుజ్జునుజ్జు అయింది.
ఆర్టీసీ బస్సు మరో ఇద్దరి ప్రాణాలు బలిగొంది.. ఓవర్ స్పీడుతో వెళుతున్న బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరిని ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం లాక్కోర జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటో డీ కొనడంతో ఆటోలో ఉన్న ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ నుండి కమ్మర్పల్లి వెళ్తున్న ఆటోను వరంగల్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న బస్సు డి కొనడంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. మహిళ హాస్పిటల్ లో మృతి చెందింది మరొకరు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.