Home /News /telangana /

NAZIMABAD ROWDY SHEETER THREATENS YOUTH WITH GUN AT KAMAREDDY VRY NZB

Kamareddy : మద్యం మత్తులో కారుపై యూరిన్.. ఏమిటని ప్రశ్నిస్తే.. తుపాకి గురి .. ఆ తర్వాత

పోలీసులు అదుపులో నిందితులు

పోలీసులు అదుపులో నిందితులు

Kamareddy : మద్యం మత్తులో పార్క్ చేసిన కారుపై మూత్రం పోయడమే కాకుండా .. దాన్ని ప్రశ్నించినందుకు తుపాకితో బెదిరింపులకు దిగారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో నిందితులు కటకటాలపాలయ్యారు.

    మద్యం మత్తులో తాము ఏం చేస్తున్నామో తెలియకుండా కొంతమంది వ్వవహరిస్తారు. అయితే కొంతమంది మాత్రం మద్యం మత్తులో తాము ఏం చేసిన నడుస్తుందనే కోణంలో వ్వవహరిస్తారు. నిత్యం నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకుని అనామకులను సైతం బెదిరింపులకు గురి చేస్తారు. అయితే చాలా మంది వాళ్ల రౌడియిజానికి భయపడి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కేందుకు వెనకడుగు వేస్తారు. దీంతో వారి ఆగడాలు ఎక్కువతుంటాయి.ఇలా ఓ వ్యక్తిపై రౌడీయిజం చూయించిన గ్యాంగ్ కటకటాల పాలైయ్యారు.

    వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా  భిక్కనూరు మండలం పొందుర్తి గ్రామ శివారులోని  ఓ దాబా వద్ద టేక్రియాల్ కు చెందిన సంతోష్ తో పాటు అతని స్నేహితులు భోజనం చేసేందుకు కార్ పార్క్ చేసి వెళ్ళారు. సంతోష్‌తో పాటు అతని స్నేహితులు భోజనం చేసి బయటకు వస్తుండగా కారు పై జనార్దన్ అనే వ్యక్తి మూత్ర విసర్జన చెస్తూ కనిపించాడు. దీంతో  సంతోష్ కారు కనిపించడం లేదా అని అనడంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. అంతలోనే జనార్ధన్ స్నేహితులైన సాజిద్, రవీందర్ లు సంతోష్ తో పాటు అతని స్నేహితులతో గొడవకు దిగారు. అయితే  సాజిద్ అతని వద్ద ఉన్న తుపాకిని తీసి సంతోష్ తలకు పెట్టి చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేశారు.

    Siddipet : అప్పుడు నక్సలిజానికి పునాది ఆ ఊరు.. నేడు దేశభక్తితో నిండిపోయింది. కారణం ఇదే..

    దీంతో భయభ్రాంతులకు గురైన సంతోష్ అతని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సాజిద్, రవీందర్, జనార్ధన్ లను  పట్టుకొని వారి వద్ద ఉన్న ఒక పిస్తోల్ 7 బుల్లెట్ లు,  ఒక కారు, మూడు సెల్ ఫోన్  లను  స్వాధీనం చేసుకున్నారు.

    Encounter : తెలంగాణ సరిహద్దులో ఎన్‌కౌంటర్ మావోల మృతి .. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం..

    కాగా సాజిద్, కామారెడ్డి పట్టణ పరిధి లో పలు నేరాలు చేసి జైలుకు వెళ్లాడు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో  రౌడీషీటర్ కూడా ఉన్నట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో బెదిరింపులు చేస్తూ.. అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు..ఇలా గతంలోనే పలుసార్లు బైండోవర్లు చేసినా తీరు మారలేదని పోలీసులు తెలిపారు.. తాజా కేసులో మరోసారి సాజిద్ అండ్‌ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Kamareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు