(P.Mahender,News18,Nizamabad)
సీఎం కేసీఆర్ పీఆర్‌టీయూకు ఉన్న బందం ఓకరు తెంపితే తేగేది కాదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.. అది తండ్రి బిడ్డల బందం లాంటిది.. ఎప్పటికి విడదియా లేనిదని ఆయన వివరించారు.. కొన్ని చెప్పేవి ఉంటాయి. కొన్ని చెప్పకూడానివి ఉంటాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసే బాధ్యత ఎమ్మెల్సీ కవితమ్మది, నాదీ అని మంత్రి వేముల అన్నారు. పంచాయతీ రాజ్ టీచర్స్ యూనియన్ 34వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిజామాబాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్ లో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా హజరయ్యారు.. వీరితో పాటు పిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కాటేపల్లి జనార్దన్, శాసన మండలి సభ్యులు రఘోత్తం రెడ్డి, నగర మేయర్ నీతూ కిరణ్, పిఆర్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్ రావు, పి ఆర్ టి యు నిజామాబాద్ అధ్యక్షులు మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Huzurabad by elections : హుజూరాబాద్ నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే..
మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆనంతరం పీఆర్‌టీయూ ఎన్నికల్లో గెలుపొందిన వారికి శాలవా కప్పి మంత్రి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిఆర్టియు అనే సంస్థతో తన అనుబంధం ఇప్పటిది కాదని తమ తండ్రి ఉన్నప్పటి నుండి ఉన్నదన్నారు. లక్షా రెండు వేల మంది టీచర్లు ఉంటే అందులో 75 వేల మంది పి ఆర్ టి యు సభ్యులు ఉన్నారన్నారు. టీచర్ల ప్రయోజనాలు, వారి హక్కులు కాపాడుకోవడానికి, వాటిని పొందటానికి నిబద్ధతతో కలిసి పనిచేసే నాయకత్వం, అందరూ ఒకే కుటుంబ సభ్యులుగా ఒకరికొకరు కలిసి పనిచేసే వ్యక్తులు ఈ సంఘంలో ఉన్నారన్నారు.
తమ సభ్యులకు ఏ అవసరం వచ్చిన దానిని నెరవేర్చడానికి సంఘ ప్రతినిధులు అత్యంత నమ్మకంగా పని చేస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ నాయకుడు తెలంగాణ రాష్ట్రం కోసం నడిపించిన ఉద్యమంలో క్షేత్రస్థాయిలో చాలా మందితో కలిసి పనిచేసినాము.. ఎవరి స్థాయిలో వాళ్లు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ఆనాటి ఉద్యమంలో కెసిఆర్ వెంట నడిచిన వ్యక్తులం అన్నారు.. ఆ ఉద్యమమే మిమ్మల్ని ఒక శక్తి గా రూపొందించింది అన్నారు. సీఎం కేసీఆర్ కు పీఆర్‌టీయూకి తండ్రి కొడుకు బందం ఉందని ఆయన అన్నారు.. ఎవరు వీడదియలేని బందం ఈ బందం అని మంత్రి చెప్పారు.. మీకు ఇచ్చిన హామిలు, ఇవ్వని హామిలను కూడా కలిపి నేను, ఎమ్మెల్సీ కవితమ్మ కలిసి నేర్చుతామని హామి ఇస్తున్నాను అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.