(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
దేశం మొత్తం కరోనా మహమ్మారి ఆగ్రహ జ్వాలాలతో విల విలలాడుతుంటే ఓ గ్రామం మాత్రం కరోనాని ఇప్పటి వరకు మొదటి, రెండో విడతల్లో దరిచేరనియకుండ ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తోంది. మహారాష్ట్ర సరిహద్దులో ఉండి కూడా ఇప్పటి వరకు ఆ గ్రామం లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటే అర్థం చేసుకోవచ్చు గ్రామస్తుల కట్టడి ఏస్థాయిలో ఉందో. పూర్తి వివరాలు తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా చిట్ట చివరి గ్రామం బోధన్ మండలం లోని బికినెల్లి గ్రామం. ఈ గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉంటారు. బికినెల్లలి గ్రామం నుండి బయట అడుగు పెడితే మహా రాష్ట్ర సరిహద్దు.. ఆ గ్రామస్తులందరికీ మహారాష్ట్ర లో బంధుత్వాలు ఉన్నాయి. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో గ్రామ సర్పంచ్ నాగ కళ పిరాజి ఆధ్వర్యంలో పటిష్టమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ప్రతి ఒక్కరూ బయటకి వస్తే మాస్క్ తప్పని సరి వాడడంతో పాటు సామాజిక దూరం పాటిస్తూ రాష్ట్రం లోనే కరోనాను దరిచేరానియని గ్రామంగా బిక్కినెల్లి గ్రామం నిలుస్తుంది. వాస్తవానికి జిల్లాకి మారు మూల గ్రామం అందులో మహారాష్ట్ర కి సరిహద్దు గ్రామం కావడంతో అభివృద్ధిలో వెనకబడి ఉన్నా.. కరోనా కట్టడి లో రాష్ట్రానికే ఈ గ్రామం ఆదర్శం గా నిలిచిందని చెప్పుకోవచ్చు.
పోలీసు, రెవెన్యూ, పంచాయితి రాజ్ శాఖలు ఎంత శ్రమించినా ఆగని కరోనా కట్టడి గ్రామస్తుల ఐకమత్యం తో ఆగింది. మొదటి వేవ్ కరోనా సమయంలో సైతం గ్రామం లో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ప్రస్తుతం సెకండ్ వేవ్ లో సైతం ఈనాటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామం లో ప్రతి ఒక్కరికి మహారాష్ట్ర లో బంధుత్వాలు ఉన్నప్పటికీ గ్రామం నుండి ఒక్కరు కూడా మహారాష్ట్ర కి రాకపోకలు జరపకుండా గ్రామ పంచాయితీ పాలక వర్గం, సిబ్బంది కట్టడి చేసింది.
ప్రభుత్వ అదేశాలని పటిష్టంగా గ్రామస్తుల సహకారంతో పాటించడం వల్లనే కరోనాని కట్టడి చెయ్యగలిగామాని గ్రామ సర్పంచ్ నాగ కళ, గ్రామస్తుడు పిరాజ్ తెలిపారు. దేశం మొత్తం కరోన మహమ్మారి తో అతలాకుతలం అవుతుంటే బికినెల్లి గ్రామంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గ్రామంలో ప్రతి ఒక్కరు మాస్కులు తప్పని సరి ధరిస్తారని, మహారాష్ట్ర లో కేసులు అధికంగా ఉన్నా కూడా పూర్తిగా రాక పోకలు కట్టడి చెయ్యడం వల్ల కరోనా మహమ్మారిని దరి చేర నియ్యలేదని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona cases, Corona free villages, Maharashtra, Nizamabad