(పి. మహేందర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)
ఎనిమిది నెలల క్రితం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేదుకు కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాను విడుదల చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా డబ్బులు విడుదల చేసి బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంబించాకుండా రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తచ్చారం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కొసం ఆందోళనకు దిగామని అయన చెప్పారు. ఈ ధర్నాకు మద్దతు ఇవ్వలాని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గొవర్ధన్, ఆర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను ఆహ్వనించాము.. కానీ వారు మాకు సహకరించాలేదన్నారు.. రోజు 60కి పైగా రైళ్లు ఈ మార్గంలో వెళ్లడంతో అత్యవరంగా ఆసుపత్రికి వచ్చే వారి ప్రాణాలు కూడా పోతున్నాయని అయన గుర్తుచేశారు.
నిజామాబాద్ జిల్లా మాదవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఈ రోజు భాజాపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి ఆర్వింద్ పాల్గొన్నారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్లు, రూరల్ నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి డౌన్ డౌన్, బ్రిడ్జి వెంటనే నిర్వించాలి.. ఎమ్మేల్యేలు బిగాల, బాజిరెడ్డి గోవర్దన్ వస్తున్నారా.. లేదా.. అనే ప్లకారుడులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఎంపి ఆర్వింద్ మాట్లాడుతూ.. మాదవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి డిమాండ్ నేను పుట్టక ముందునుంచి ఉంది.. ఆనాటి నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.. వారి ఇబ్బందులను గుర్తించి నేను ఎంపీగా గెలిచిన తరువాత ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం శ్రమించాను.. బ్రిడ్జి నిర్మాణానికి కావాల్సిన నిధులను సమకుర్చాను అన్నారు. అయితే కేంద్రం నుంచి రావాల్సిన 30కోట్ల రూపాయలు మంజురుకు ఉత్తర్వులు వచ్చాయని.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వడానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పెండింగ్ లో పెట్టాడన్నారు.
ఎనిమిది నెలలుగా మంత్రి వద్దనే ఫైల్ ఉంది.. కానీ ఆయన ఇంకా స్పందించడం లేదు.. మంత్రి ప్రశాంత్ రెడ్డికి లెటర్లు రాశాను.. బతిమాలాను.. దండం పెట్టాను... అయినా ఆయన స్పందిచక పోవడంతో చేసేదేమి లేక ఈ ధన్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. తాను రాజకీయల కోసం చేయడం లేదని.. ఎమ్మేల్యేలను నిరసన కార్యక్రమానికి రావాలని ఆహ్వానం పంపాను కానీ వారు రాలేదన్నారు. కనీసం మద్దతు కూడా తెలుపలేదని తెలిపారు. పసుపు బోర్డు కొసం ధర్నా చేస్తే వారు వస్తామని ప్రెస్ మీట్ పెట్టారు.. పసుపు బోర్డు కంటే రైతులకు ఎంతో మేలు చేసే స్పైసి బోర్డు తీసుకువచ్చిన విషయం వీరికి అర్థం కావడం లేదని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజల అవసరాలను గుర్తించి వారికి ఉపయోగపడే పనులు చేయాలని .. పార్టీలను పక్కన పెట్టి ప్రజల కొసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.